NTR – Naga Chaitanya : జపాన్ లో నాగచైతన్యని తెగ పొగిడేసిన ఎన్టీఆర్.. మై డియర్ ఫ్రెండ్ అంటూ.. వీడియో వైరల్..

జపాన్ లో ఎన్టీఆర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య గురించి గొప్పగా మాట్లాడారు.

NTR Praises Naga Chaitanya Restaurant Food in Japan Interview

NTR – Naga Chaitanya : ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో ఉన్న సంగతి తెలిసిందే. దేవర సినిమా జపనీస్ వర్షన్ నిన్న మార్చ్ 28న అక్కడ రిలీజయింది. దేవర ప్రమోషన్స్ కోసం గత వారం రోజులుగా ఎన్టీఆర్ అక్కడే ఉండి భారీగానే ప్రమోట్ చేసాడు. అక్కడ మీడియాకు పలు ఇంటర్వ్యూ లు కూడా ఇచ్చాడు. జపాన్ లో ఎన్టీఆర్ కి అక్కడి జపాన్ ఫ్యాన్స్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి వారి ప్రేమని చూపించారు.

ఎన్టీఆర్ కూడా జపాన్ వాళ్ళు చూపిస్తున్న ప్రేమని చూసి మురిసిపోయి దానిపై పోస్ట్ కూడా చేసారు. అయితే జపాన్ లో ఎన్టీఆర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య గురించి గొప్పగా మాట్లాడారు. ఇంటర్వ్యూలో జపాన్ ఫుడ్ గురించి ప్రస్తావన వచ్చింది.

Also Read : Dokka Seethamma : ‘డొక్కా సీతమ్మ’ బయోపిక్ తో రాబోతున్న ఆమని.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్.. ఈ సినిమాపై వచ్చే డబ్బులన్నీ..

దాంతో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో నా ఫ్రెండ్ షోయు అని రెస్టారెంట్ నడుపుతున్నాడు. నా ఫ్రెండ్ నాగచైతన్య, అతను యాక్టర్ కూడా. అక్కడ ప్యూర్ జపనీస్ ఫుడ్ దొరుకుతుంది. ముఖ్యంగా సుషీ బాగా తింటాను. షోయు లో బెస్ట్ సుషీ, జపనీస్ ఫుడ్ దొరుకుతుంది. ఉనిగి కూడా బాగుంటుంది. మీరు షోయులో ట్రై చేయాలి అని అన్నారు. దీంతో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాగ చైతన్య ఫ్యాన్స్ ఈ వీడియోని కట్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు. మరి నాగ చైతన్య దాకా ఈ వీడియో ఇంకా వెళ్లిందో లేదో, వెళ్తే ఎలా స్పందిస్తాడో చూడాలి.

నాగ చైతన్య కరోనా సమయంలో షోయు అనే క్లౌడ్ కిచెన్ రెస్టారెంట్ మొదలుపెట్టి జపనీస్, కొన్ని దేశాల ఫుడ్ ని సర్వ్ చేస్తున్నాడు. ఆ రెస్టారెంట్ బాగానే సక్సెస్ అయింది. ఇప్పుడు స్కుజి అనే మరో రెస్టారెంట్ కూడా ఇటీవలే మొదలుపెట్టాడు.