Dokka Seethamma : ‘డొక్కా సీతమ్మ’ బయోపిక్ తో రాబోతున్న ఆమని.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్.. ఈ సినిమాపై వచ్చే డబ్బులన్నీ..
తాజాగా నేడు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ సినిమా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Aamani Coming with Dokka Seethamma Biopic Movie First Look Released
Dokka Seethamma Biopic : ఒకప్పటి హీరోయిన్ ఆమని ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కీలక పాత్రల్లో సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగానే ఉంది. ఇటీవలే నారి అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చిన ఆమని తాజాగా అందరూ ఆశ్చర్యపోయేలా ఓ కొత్త సినిమా ప్రకటించారు. ఎంతోమందికి అన్నదానం చేసి, ఆంధ్రుల అన్నపూర్ణ అని పిలుచుకునే డొక్కా సీతమ్మ బయోపిక్ లో ఆమని నటిస్తుంది.
తాజాగా నేడు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ సినిమా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. మురళీ మోహన్, ఆమని ముఖ్య పాత్రల్లో ఉషారాణి మూవీస్ బ్యానర్ పై వల్లూరి రాంబాబు నిర్మాణంలో టి.వి.రవి నారాయణ్ దర్శకత్వంలో ఈ ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఫస్ట్ లుక్ లో డొక్కా సీతమ్మలాగే కుర్చీలో కూర్చొని తెల్లచీరతో గుండుతో ఉంది ఆమని. దీంతో ఈ ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది.
ఈ ఈవెంట్లో నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ .. డొక్కా సీతమ్మ లాంటి మహనీయులైన కథతో సినిమా తీయడం గొప్ప విషయం. ఇలాంటి వారి గురించి జనాలకు తెలియాలి. నాలుగు వందల ఎకరాలు అమ్మేసి అందరికీ అన్నం పెట్టిన మహనీయురాలు ఆమె. ఆమని గారు చేస్తున్న ఈ పాత్రతో ఆమె మీద అందరికీ గౌరవం పెరుగుతుంది అని అన్నారు.
Also Read : Kannappa : ‘కన్నప్ప’ సినిమా వాయిదా.. సారీ చెప్తూ మంచు విష్ణు పోస్ట్..
డైరెక్టర్ టి.వి.రవి నారాయణ్ మాట్లాడుతూ .. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఒక మంచి పని చేయాలి అనుకునే నాకు డొక్కా సీతమ్మ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. దాంతో డొక్కా సీతమ్మ గారి చరిత్ర అందరికి తెలియాలని ఈ సినిమా తీస్తున్నాను. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రొడ్యూసర్ గారు విరాళంగా ఇస్తాం. డొక్కా సీతమ్మ పేరు మీద ఉన్న పథకానికి ఆ డబ్బులు విరాళంగా ఇస్తాం. మొదటి సినిమానే డొక్కా సీతమ్మ లాంటి మహనీయురాలైన కథతో చేస్తుండటం నా అదృష్టం అని తెలిపారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ .. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. వచ్చిన ప్రతీ ఒక్కరికీ కడుపునిండా అన్నం పెట్టి పంపేవారు డొక్కా సీతమ్మ. ఇలాంటి గొప్ప వారి గురించి ప్రస్తుత తరానికి తెలియాలి. ఆమని గారికి ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలి అని అన్నారు.
Also Read : Sitara Ghattamaneni : ఓ షాప్ ఓపెనింగ్ కి సితార పాప.. ఉగాది నాడు.. ఏ టైంకి? ఎక్కడో తెలుసా?
ఆమని మాట్లాడుతూ.. నేను బెంగళూర్‌కు చెందిన వ్యక్తిని. నాకు ఆమె గురించి ఎక్కువగా తెలీదు. డైరెక్టర్ కథ చెప్పాక గూగుల్‌లో ఆమె గురించి వెతికాను. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి తెలిసాక ఈ పాత్ర చేయాలంటే రాసి పెట్టి ఉండాలి అని ఒప్పుకున్నాను అని తెలిపారు. నిర్మాత రాంబాబు మాట్లాడుతూ.. డొక్కా సీతమ్మ గారి కథను, చరిత్రను అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తీస్తున్నాం. త్వరలోనే ఈ సినిమా రిలిజ్ చేస్తాం అని తెలిపారు.