NTR – Vishwak – Siddhu : విశ్వక్, సిద్ధూ జొన్నలగడ్డతో ఎన్టీఆర్ స్పెషల్ దేవర ఇంటర్వ్యూ.. ఫోటో లీక్..

తాజాగా మన తెలుగులో దేవర ప్రమోషన్స్ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.

NTR Promotional Interview with Siddhu Jonnalagadda and Vishwak Sen for Devara Movie Promotions

NTR – Vishwak – Siddhu : ఎన్టీఆర్ దేవర సినిమాతో సెప్టెంబర్ 27న రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా వైడ్ చేస్తున్నారు. ఇటీవల ముంబైలో అలియా భట్ తో పాటు మరి కొంతమందితో దేవర ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేసాడు ఎన్టీఆర్.

తాజాగా మన తెలుగులో దేవర ప్రమోషన్స్ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. యువ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో కలిసి ఎన్టీఆర్, కొరటాల శివ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్రమోషన్స్ కోసం చేస్తున్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ షూట్ చేస్తుండగా ఓ ఫోటో మూవీ యూనిట్ డైరెక్ట్ గా లీక్ చేసి మాసివ్ ఇంటర్వ్యూ రాబోతుంది అని హింట్ ఇచ్చింది.

Also Read : Devara – NTR : ‘దేవర’ రిలీజ్ సమయానికి ఎన్టీఆర్ ఇక్కడ ఉండడా..? మరి ఎక్కడికి వెళ్తున్నాడు..?

విశ్వక్ మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ అభిమాని అని తెలిసిందే. గతంలో విశ్వక్ సినిమా ఈవెంట్స్ కి ఎన్టీఆర్ వచ్చాడు. విశ్వక్ తో పాటు సిద్ధూ కూడా ఎన్టీఆర్ కి క్లోజ్ అయ్యాడు. టిల్లు స్క్వేర్ సినిమా సమయంలో ఈ ముగ్గురు కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురితో స్పెషల్ ఇంటర్వ్యూ రాబోతుందని తెలియడంతో ఫ్యాన్స్ ఈ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు.