Devara – NTR : ‘దేవర’ రిలీజ్ సమయానికి ఎన్టీఆర్ ఇక్కడ ఉండడా..? మరి ఎక్కడికి వెళ్తున్నాడు..?

తాజాగా ఎన్టీఆర్ గురించి ఓ న్యూస్ వినిపిస్తుంది.

Devara – NTR : ‘దేవర’ రిలీజ్ సమయానికి ఎన్టీఆర్ ఇక్కడ ఉండడా..? మరి ఎక్కడికి వెళ్తున్నాడు..?

NTR Not Available at the time of Devara Movie Release New goes Viral

Updated On : September 13, 2024 / 6:45 PM IST

Devara – NTR : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి భారీ అంచనాలు పెంచారు. సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రలు పోషిస్తున్నాడు అని తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి. ట్రైలర్ లాంచ్ ముంబైలో గ్రాండ్ గా చేసి బాలీవుడ్ లో ప్రమోషన్స్ కూడా బాగా చేసారు మూవీ యూనిట్.

అయితే దేవర సినిమా ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండవు అని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ గురించి ఓ న్యూస్ వినిపిస్తుంది. దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. అమెరికాలో ముందు రోజు రాత్రే సెప్టెంబర్ 26న ప్రీమియర్స్ వేయబోతున్నారు. అయితే ఎన్టీఆర్ దేవర రిలీజ్ సమయానికి ఇక్కడ ఉండకుండా అమెరికాకు వెళ్తున్నాడట.

Also Read : Devara : దేవ‌ర సెన్సార్ పూర్తి.. ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారో తెలుసా?

అమెరికాలోని ప్రీమియర్ షోలకు ఎన్టీఆర్ హాజరు కానున్నట్టు టాలీవుడ్ టాక్. ఇప్పటికే రిలీజ్ కి 17 రోజుల ముందే దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసి కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. ఎన్టీఆర్ దేవర రిలీజ్ సమయానికి ఇక్కడ ఉండకుండా అమెరికా వెళ్ళిపోతాడు అని టాక్ రావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద రిలీజ్ రోజు ఏ రేంజ్ రచ్చ చేస్తారో తెలిసిందే.