Devara : దేవర సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెట్ ఇచ్చారో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర.

Devara movie censor complete get u_a certificate
Devara censor : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వీకపూర్ ఈ మూవీతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కుతోంది. తొలి భాగం సెప్టెంబర్ 27 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేయగా రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Utsavam : ‘ఉత్సవం’ మూవీ రివ్యూ.. అంతరించిపోతున్న నాటకాలకు ప్రేమ కథ ముడి వేసి..
మూవీలో నాలుగు మార్పులు చేయాలని చిత్రబృందానికి సెన్సార్ బోర్డు సూచించినట్లు తెలుస్తోంది. భార్య, తల్లిని కడుపులో తన్నడం లాంటి సీన్స్ లతో పాటు ఇలాంటివి మరికొన్ని మార్పు చేయాలని సూచించారంట. ఇక ఈ చిత్ర రన్‌టైమ్ 2 గంటల 58 నిమిషాలుగా ఉండనుంది.
ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు మూవీలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమా హైలైట్‌గా ఉందని చెప్పినట్లు టాక్. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
VENOM THE LAST DANCE : ‘వెనమ్ – ది లాస్ట్ డాన్స్’ ట్రైలర్.. గూస్ బంప్స్ అంతే