NTR : నా అభిమాని ప్రాణం కోల్పోయాడు.. అప్పట్నుంచి కొంచెం దూరంగా ఉన్నాను..

నేడు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

NTR

NTR : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న వార్ 2 సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. నేడు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. భారీగా అభిమానుల మధ్య ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హృతిక్ రోషన్ కూడా వచ్చారు.

ఎన్టీఆర్ బహిరంగ ఈవెంట్లో, భారీ జనసందోహంలో సినిమా ఈవెంట్ చేసి చాలా కాలం అయింది. ఎన్టీఆర్ గత కొన్ని ఈవెంట్స్, గెస్ట్ గా వచ్చిన ఈవెంట్స్ ఇన్ డోర్ లోనే చేసారు. చాన్నాళ్లకు మళ్ళీ బహిరంగంగా ఎన్టీఆర్ సినిమా పబ్లిక్ ప్లేస్ లో జరిగింది.

Also Read : NTR Fan : నా మొదటి అభిమాని ఇతనే.. నేను హీరో అవ్వకముందే.. స్టేజిపై వీరాభిమానిని పరిచయం చేసిన ఎన్టీఆర్..

దీని గురించి ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఈ పండగ చేయడానికి నాగవంశీ నన్ను బాగా బలవంత పెట్టాడు. అందుకు థ్యాంక్స్. మీకు గుర్తుందో లేదో కొన్నేళ్ల క్రితం బాద్ షా ఈవెంట్ అప్పుడు వరంగల్ కి చెందిన ఓ అభిమాని ప్రాణం కోల్పోయాడు తొక్కిసలాటలో. అప్పట్నుంచి నేను బహిరంగ ఈవెంట్స్ కి కొంచెం దూరంగా ఉంటున్నాను. కానీ 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మీ అందర్నీ కలుసుకోవాలని నాకు ఉంది. అందుకే ఈ ఈవెంట్. ఇందుకు వంశీ ఫోర్స్ చేసాడు, అతను ఫోర్స్ చేసేలా మీరు చేసారు అని తెలిపారు.

Also Read : War 2 Pre Release Event : వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ స్పెషల్ ఫోటోలు..