NTR Fan : నా మొదటి అభిమాని ఇతనే.. నేను హీరో అవ్వకముందే.. స్టేజిపై వీరాభిమానిని పరిచయం చేసిన ఎన్టీఆర్..

ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ తన మొదటి అభిమానిని పరిచయం చేసాడు.

NTR Fan : నా మొదటి అభిమాని ఇతనే.. నేను హీరో అవ్వకముందే.. స్టేజిపై వీరాభిమానిని పరిచయం చేసిన ఎన్టీఆర్..

NTR Fan

Updated On : August 10, 2025 / 10:21 PM IST

NTR Fan : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో బాలీవుడ్ లో భారీగా తెరకెక్కుతున్న స్పై సినిమా వార్ 2 ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. నేడు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. భారీగా అభిమానుల మధ్య ఈవెంట్ ని నిర్వహించారు.

వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ తన మొదటి అభిమానిని పరిచయం చేసాడు.

Also Read : War 2 Pre Release Event : వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ స్పెషల్ ఫోటోలు..

ఎన్టీఆర్ ఈవెంట్లో మాట్లాడుతూ.. 25 ఏళ్ళ క్రితం నిన్ను చూడాలని సినిమాతో నా కెరీర్ మొదలైంది. కీర్తిశేషులు రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్ లో పరిచయం చేసారు. ఆ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ కి వెళ్ళినపుడు నా పక్కన మా నాన్న, అమ్మ తప్ప ఎవరూ లేరు. వెళ్ళాను, వచ్చాను ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలీదు నాకు. నా మొదటి అభిమాని ముజీబ్ అని ఉంటాడు. ఇక్కడే ఎక్కడో ఉంటాడు ఇప్పుడు కూడా. ఆదోని నుంచి వచ్చాడు. నా మొదటి సినిమా మొదలైనప్పుడు నేను మెహదీపట్నం దగ్గర ఇంట్లో ఉండేవాడిని. ఇక్కడ రెంట్ ఆఫీస్ తీసుకొని ఉన్నాను. నా ఆఫీస్ కి వచ్చి నా ఫ్యాన్ అన్నాడు. నేనంటే పడి చచ్చిపోతాను అన్నారు. నా సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు అప్పుడే ఫ్యాన్ ఏంటి అన్నాను. నా వెంటే ఉంటాను అన్నాడు. ముజీబ్ తర్వాత చాలా మంది అభిమానులు వచ్చారు అని తన మొదటి అభిమాని గురించి తెలిపాడు .

ఎన్టీఆర్ ముజీబ్ గురించి మాట్లాడుతుండగా ముజీబ్ స్టేజి పైకి వచ్చాడు. దాంతో ఇతనే అని అందరికి తన వీరాభిమానిని పరిచయం చేసాడు.

Also Read : NTR Full Speech : ఇది ఎన్టీఆర్ హిందీకి వెళ్లిన సినిమా కాదు.. నన్ను ఎవరూ ఆపలేరు.. కాలర్ ఎత్తి 25 ఇయర్స్ ఎన్టీఆర్ స్పెషల్ స్పీచ్..