NTR shares a pic had gone viral
NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక మధురమైన చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించి.. యాక్టర్‌గా వరల్డ్ వైడ్ గుర్తింపుని సంపాదించుకున్నాడు తారక్. స్వాతంత్ర సమరయోధుడు కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కనబరిచిన నటనకి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ హీరో తదుపరి సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
NTR30: తారక్ వేలిపై కొత్త బజ్.. ఎక్స్‌ట్రా ఉండటమే మంచిదట..?
ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లిన తారక్.. అక్కడ మియామీ బీచ్ అందాలని భార్యతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే, ‘భార్య ప్రణతిని తన ప్రేమ కౌగిళ్ళలో బందిస్తూ’ ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.
కాగా ఎన్టీఆర్, కొరటాల సినిమా వచ్చే ఏడాది పట్టాలు ఎక్కనుంది అంటా. ఫిబ్రవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది అని తెలుస్తుంది. అయితే అంతకంటే ముందే ఈ సినిమా గురించి వివరాలు తెలిపేలా.. దర్శకుడు కొరటాల శివ ఒక స్పెషల్ వీడియోని విడుదల చేయబోతున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.