NTR : ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా.. ఆ కాస్ట్ తో ఒక చిన్న సినిమా తీసేయొచ్చు

తాజాగా నిన్న ఎన్టీఆర్ పెట్టుకొచ్చిన వాచ్ కూడా ఇలాగే వైరల్ అయింది. ఇంతకీ ఎన్టీఆర్ నిన్న పెట్టుకొచ్చిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?? ఎన్టీఆర్‌ చేతికి ఉన్న ఆ వాచ్‌ గురించి సెర్చ్ చేయగా....

Ntr Watch

 

NTR  :  ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ టీం వరుస సక్సెస్ పార్టీలు చేసుకుంటుంది. ఈ సినిమాకి కలెక్షన్స్ బాగా రావడంతో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వారంతా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తుండగా ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి వీటికి హాజరవుతున్నారు. ఇటీవల నైజాం డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించాడు. తాజాగా నార్త్ డిస్ట్రిబ్యూటర్ పెన్ స్టూడియోస్ సంస్థ ముంబైలో ఆర్ఆర్ఆర్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది.

 

అయితే ఈ వేడుక కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్‌ చేతికి పెట్టుకున్న వాచ్‌ గురించి ఇప్పుడు వైరల్ అవుతుంది. మన సెలబ్రిటీలు ఎలాంటి యాక్ససరీస్ వాడినా అభిమానులు, ప్రేక్షకులు అవి పసిగట్టేస్తారు. వాటి గురించి ఆన్లైన్ లో వెతికేస్తారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఖరీదైన డ్రెస్ లు, వాచ్ లు, షూస్, ఇలా ఏం వాడినా నెటిజన్లు, అభిమానులు ఇట్టే పట్టేస్తారు. తాజాగా నిన్న ఎన్టీఆర్ పెట్టుకొచ్చిన వాచ్ కూడా ఇలాగే వైరల్ అయింది.

Vijay Devarakonda: సెట్స్ మీదకి శివ నిర్వాణ సినిమా.. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్‌లో కథ!

ఇంతకీ ఎన్టీఆర్ నిన్న పెట్టుకొచ్చిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?? ఎన్టీఆర్‌ చేతికి ఉన్న ఆ వాచ్‌ గురించి సెర్చ్ చేయగా ఆ వాచ్‌ పేరు, మోడల్ Patek Philippe Nautilus 5712 1/A. ఇది విదేశాలకు చెందిన Patek Philippe అనే బ్రాండెడ్‌ వాచ్‌. దీని ఖరీదు దాదాపు కోటి 70 లక్షల పైనే ఉన్నట్టు సమాచారం. ఈ బ్రాండ్‌లో ఉండే అన్ని వాచ్‌ లు కూడా దాదాపు అంతే ధర ఉంటాయి. గతంలోనూ పలు మార్లు ఎన్టీఆర్ ఖరీదైన వాచ్ లు ధరించాడు.

Khatra (Dangerous): సినిమా వాయిదా కారణం ఇదే.. వర్మ వీడియో!

ఎన్టీఆర్ కి ఇలా ఖరీదైన వాచ్ లు కలెక్ట్ చేయడం ఇష్టం అనుకుంట. ఎన్టీఆర్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే ఇలాంటి ఖరీదైన వాచ్ లే ఇస్తూ ఉంటాడు. గతంలో టెంపర్ సినిమా రిలీజ్ అయి విజయం సాధించినప్పుడు పూరి జగన్నాధ్ కి కూడా ఓ ఖరీదైన వాచ్ ని బహూకరించాడు ఎన్టీఆర్.