NTR Will do Movie with Jailer Director Nelson Dilip Kumar Rumors goes Viral
NTR : మన హీరోలు పాన్ ఇండియా స్టార్స్ అవ్వడంతో, పాన్ఇండియా లో భారీ గా మార్కెట్ పెరగడంతో తమిళ్ టాప్ డైరెక్టర్లు తెలుగు హీరోల వెంటపడుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ అట్లీని లైన్లో పెడితే లేటెస్ట్ గా ఎన్టీఆర్ జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా కమిట్ అయినట్టు తెలుస్తోంది.
ఈ ఇంట్రస్టింగ్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ సినిమా షూటింగ్ మొదలుపెట్టేశారు. ఆల్రెడీ హిట్ అయిన దేవర కి సీక్వెల్ కూడా రైటింగ్ వర్క్ స్టార్ట్ చేసేశారు. ఇక హిందీలో ఆల్రెడీ వార్ 2 లాస్ట్ స్టేజ్ లో ఉంది.
Also Read : Nagarjuna – Puri Jagannadh : నాక్కొంచెం మెంటల్.. ‘సూపర్’ హిట్ ‘శివమణి’ కాంబో మళ్ళీ..?
ఈ టైమ్ లో ఎన్టీఆర్ తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కి ఓకే చెప్పారు. జైలర్ తో సూపర్ హిట్ కొట్టిన నెల్సన్ ప్రస్తుతం రజనీకాంత్ తో జైలర్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ తమిళ్ లో వెట్రిమారన్ డైరెక్టర్ తో చేయాలని ఉంది అన్నాడు. ఈ లోపే నెల్సన్ వచ్చి కథ చెప్పి ఓకే చేసాడని తెలుస్తుంది. అది కూడా పాన్ ఇండియా సినిమానే.