Nagarjuna – Puri Jagannadh : నాక్కొంచెం మెంటల్.. ‘సూపర్’ హిట్ ‘శివమణి’ కాంబో మళ్ళీ..?
ఇప్పటి స్టార్ హీరోలందరికీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన పూరీతో ఇప్పుడు చిన్న హీరోలు కూడా సినిమా చెయ్యడానికి ఇష్టపడడం లేదు.

Puri Jagannadh will do Movie with Nagarjuna Rumors goes Viral
Nagarjuna – Puri Jagannadh : పూరి జగన్నాథ్ వరుస ఫెయిలూర్స్ లో ఉన్న ఒక్కప్పటి స్టార్ డైరెక్టర్. ఇప్పటి స్టార్ హీరోలందరికీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన పూరీతో ఇప్పుడు చిన్న హీరోలు కూడా సినిమా చెయ్యడానికి ఇష్టపడడం లేదు. పూరి జగన్నాథ్ లాస్ట్ మూవీస్ డబుల్ ఇస్మారెంట్ శంకర్, లైగర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవ్వడంతో విపరీతంగా ట్రోల్ అయ్యారు. పూరి దగ్గర సరుకు అయిపోయిందని సోషల్ మీడియాతో పాటు క్రిటిక్స్ కూడా కామెంట్స్ చెయ్యడంతో వీటన్నింటికీ చెక్ పెట్టేలా పూరీ అదిరిపోయే స్టోరీ రెడీ చేశారని తెలుస్తోంది.
పూరీ జగన్నాధ్ అక్కినేని హీరో నాగార్జున తో సినిమా చేస్తున్నారంటూ రూమర్ బాగా వినిపిస్తోంది. ఇప్పటి వరకూ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న పూరీ నాగార్జున కి సూట్ అయ్యే సాలిడ్ స్టోరీ రెడీ చేశారని ఆ కథకి ఇంప్రెస్ అయిన నాగార్జున సినిమా చేద్దామని చెప్పినట్టు, సమ్మర్ తర్వాత సినిమా సెట్స్ మీదకెళ్లబోతున్నట్టు సోషల్ మీడియాలో రూమర్. నిజానికి నాగార్జున పూరీ జగన్ కెరీర్ స్టార్టింగ్ లోనే శివమణి ఆఫరిచ్చారు. 2, 3 సినిమాలు మాత్రమే చేసిన పూరీకి శివమణి సినిమా ఛాన్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు నాగార్జున.
Also Read : Pushpa 2 : ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు.. పుష్ప 2 లాభాలు వాళ్లకు ఇవ్వాలంట.. హైకోర్టులో పిల్ దాఖలు..
నా పేరు శివమణి.. నాక్కొంచెం మెంటల్.. అంటూ శివమణి క్యారెక్టర్ అప్పట్లో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత సూపర్ సినిమా కూడా వీరిద్దరి కాంబోలో వచ్చింది. సూపర్ సినిమా కమర్షియల్ గా యావరేజ్ అనిపించుకున్నా సినిమాలో నాగ్ కొత్తగా, స్టైలిష్ గా కనిపించాడు. సాంగ్స్ కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఆ సినిమాతోనే అనుష్క శెట్టి పరిచయం అయింది.
అక్కినేని నాగార్జున – పూరి జగన్నాథ్.. కాంబోలో వచ్చిన సూపర్, శివమణి సినిమాలు.. ఒకటి రాబరీ బ్యాక్ డ్రాప్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అయితే.. రెండోది పోలీస్ గా నాగార్జునను సరికొత్తగా ప్రజెంట్ చేసిన మూవీ. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా అంటే ఎలా ఉండబోతోందో, ఈసారి నాగార్జున ని ఏ రేంజ్ లో చూపించబోతున్నారో అంటూ ఇంట్రస్టింగ్ చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో.
Also Read : Priyadarshi : ఆయన బయోపిక్ చేయాలని ఉంది.. బ్రహ్మానందం కొడుకు పెళ్ళిలో కనపడితే అడిగా..
కొన్నాళ్లుగా సోలో హీరోగా కాకుండా సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న నాగార్జున వరసగా ఫ్లాపుల్లో ఉన్న పూరీకి చాన్సిచ్చారంటే గ్యారంటీగా పవర్ ఫుల్ సబ్జెక్టే అయ్యిుటుందనుకుంటున్నారు ఆడియన్స్. నాగార్జున ప్రస్తుతం కూలీ, కుబేర సినిమాలు చేస్తున్నారు. సమ్మర్ తో ఈ సినిమాలు కంప్లీట్ అయిపోవడంతో సమ్మర్ తర్వాత పూరీ సినిమా మొదలుపెడతారని తెలుస్తోంది. మరి వీరిద్దరి కాంబోలో మూడో సినిమా వస్తుందా చూడాలి.