Pushpa 2 : ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు.. పుష్ప 2 లాభాలు వాళ్లకు ఇవ్వాలంట.. హైకోర్టులో పిల్ దాఖలు..
తాజాగా పుష్ప 2 సినిమాపై హకోర్టులో పిల్ దాఖలైంది.

Pil Filed in Telangana High Court on Pushpa 2 Movie
Pushpa 2 :అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పెద్ద హిట్ అయి 1850 కోట్లు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయాలతో పాటు వివాదాల్లో కూడా చాలానే వినిపించింది. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు, సంధ్య థియేటర్ ఘటన వీటితో కేసులు, కోర్టు .. అంటూ కూడా వార్తల్లో నిలిచింది పుష్ప 2 సినిమా. సినిమా రిలీజయి థియేటర్స్ లో 50 రోజులు ఆడి, ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వార్తల్లో నిలుస్తుంది పుష్ప 2.
తాజాగా పుష్ప 2 సినిమాపై హకోర్టులో పిల్ దాఖలైంది. పుష్ప2 సినిమాకు వచ్చిన లాభాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. న్యాయవాది జీఎల్‌ఎన్ నరసింహారావు ఈ పిల్ దాఖలు చేసారు. ఈ పిల్ లో.. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు వల్ల పుష్ప 2 సినిమాకి భారీగా ఆదాయం వచ్చింది. హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులిచ్చి మరీ బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షో, టికెట్ ధరలు పెంపునకు అనుమతివ్వడానికి గల కారణాలేంటో చెప్పలేదు. పుష్ప2 చిత్రానికి వచ్చిన లాభాలను చిన్న చిత్రాల బడ్జెట్ రాయితీకి వినియోగించాలి. జానపద కళాకారుల పింఛను కోసం ఈ లాభాలను కేటాయించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సినిమాల లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని తెలిపారు.
Also Read : Priyadarshi : ఆయన బయోపిక్ చేయాలని ఉంది.. బ్రహ్మానందం కొడుకు పెళ్ళిలో కనపడితే అడిగా..
దీంతో సుప్రీంకోర్టు తీర్పు కాపీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. అయితే దీనిపై పలువురు ఫ్యాన్స్, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై పుష్ప 2 నిర్మాణ సంస్థ ఏమంటుందో చూడాలి.