NTR30 Update To Be Out On NTR Birthday
NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను అత్యంత భారీ అంచనాల మధ్య చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఈ సినిమాలో తారక్ ఓ సరికొత్త పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకునేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.
NTR30 : స్పీడ్ పెంచేసిన ఎన్టీఆర్.. అప్పుడే షూట్ కంప్లీట్.. అదిరే అప్డేట్!
ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా కొరటాలతో తెరకెక్కిస్తున్న మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మోషన్ పోస్టర్‌లో తారక్ వాయిస్ ఓవర్ గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని తెలుస్తోంది. చాలా పవర్‌ఫుల్‌గా రానున్న ఈ బర్త్ డే ట్రీట్‌తో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తాయని చిత్ర యూనిట్ ఆశిస్తుంది.
NTR30: ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతున్న జాన్వీ.. హైదరాబాద్ చేరుకున్న బ్యూటీ!
ఇక ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర సంగీతాన్ని అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.