NTR30 : స్పీడ్ పెంచేసిన ఎన్టీఆర్.. అప్పుడే షూట్ కంప్లీట్.. అదిరే అప్డేట్!

NTR30 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసినట్లు చెప్పిన డీఓపీ రత్నవేలు..

NTR30 : స్పీడ్ పెంచేసిన ఎన్టీఆర్.. అప్పుడే షూట్ కంప్లీట్.. అదిరే అప్డేట్!

NTR30 second schedule completed Janhvi Kapoor Saif Ali Khan

Updated On : May 2, 2023 / 7:09 PM IST

NTR30 : జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ NTR30. RRR తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతోభారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా, సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్ట్ గా వర్క్ చేస్తున్న ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని పనిచేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్స్, ఆక్వా మ్యాన్ వంటి సినిమాలకు వర్క్ చేసిన VFX డిజైనర్, స్టంట్ మాస్టర్ NTR30 కోసం కష్ట పడుతున్నారు.

NTR : ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్.. శత జయంతి ఉత్సవాలకు పూర్తిగా దూరం..

ఇక షూటింగ్ మొదలు పెట్టుకోవడంలో లేట్ చేసిన మూవీ టీం చిత్రీకరణను పరుగులు పెట్టిస్తుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ని డీఓపీ రత్నవేలు తెలియజేశాడు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తి అయ్యినట్లు వెల్లడించాడు. ఎన్టీఆర్ పై పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని ఈ షెడ్యూల్ లో పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ స్టైల్ అద్భుతం అంటూ పేర్కొన్నాడు. కాగా ఇదే షెడ్యూల్ లో ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ అండ్ సైఫ్ (Saif Ali Khan) మధ్య ఈ సీక్వెన్స్ తెరకెక్కినట్లు తెలుస్తుంది.

NTR: ఆ క్రేజీ కాంబినేషన్ మూవీలో ఎన్టీఆర్ నటించడం లేదట..!

కాగా ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ కానుంది.