NTR30: ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతున్న జాన్వీ.. హైదరాబాద్ చేరుకున్న బ్యూటీ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

NTR30: ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతున్న జాన్వీ.. హైదరాబాద్ చేరుకున్న బ్యూటీ!

Janhvi Kapoor To Joing NTR30 Shooting From Tonight

Updated On : April 17, 2023 / 5:21 PM IST

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను ఇటీవల ప్రారంభించగా, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్‌లో ఆమె సోమవారం రాత్రి నుండి జాయన్ కానుంది.

NTR30 : సైఫ్ అలీఖాన్ కన్‌ఫార్మ్.. NTR30 సెట్స్‌లోకి త్వరలో ఎంట్రీ!

దీనికోసం జాన్వీ ముంబై నుండి హైదరాబాద్ చేరుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. తన అభిమాన హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆమె ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమాలో జాన్వీ గెటప్ పరంగా కూడా సరికొత్తగా కనిపించనుంది.

Janhvi Kapoor : ఎన్టీఆర్ కోసమే RRR మళ్ళీ చూశాను.. ఆయనతో సినిమా ఛాన్స్ కోసం రోజూ దేవుడికి దండం పెట్టుకున్నాను..

కొరటాల శివ ఈ సినిమా కథను చాలా పవర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా హిట్ అందుకోవాలని కొరటాల గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఇక సముద్రం నేపథ్యంలో ఈ సినిమా కథ రానుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా.. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.