మా దెబ్బకి RGV సినిమా స్టోరీ మొత్తం మార్చేశాడు

రామ్ గోపాల్ వర్మ ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘పవర్‌స్టార్’ సినిమా తీశాడు. ట్రైలర్, పాటలతో అంచనాలు పెంచేసిన వర్మ ఈరోజు ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో ‘పవర్‌స్టార్’ మూవీని రిలీజ్ చేశాడు.
ఈ సినిమా గురించి వర్మకి కౌంటర్‌గా ‘పరాన్నజీవి’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నూతన్ నాయుడు 10TVతో మాట్లాడారు. ‘పరాన్నజీవి’ చిత్రం ప్రకటించాక వర్మ భయపడి ‘పవర్‌స్టార్’ కథ మార్చేశాడని, రీ షూట్ చేశారని నూతన్ నాయుడు అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం గురించి పోరాడుతున్నారు. వర్మకు పాలిటిక్స్ మీద ఏం అవగాహన ఉంది?.. దొంగతెలివి తేటలు వర్మవి.. తనతో ఎవరో మాట్లాడిస్తున్నారు.. మేమనుకున్న వ్యూహం ఫలించింది అని చెప్పారు నూతన్ నాయుడు.
నిర్మాత నట్టికుమార్ కూడా 10TVతో మాట్లాడారు. ‘పరాన్నజీవి’ సినిమాకు భయపడి వర్మ ‘పవర్‌స్టార్’ కథ మార్చారనడం సరికాదని, మూడు, నాలుగు రోజుల్లో కథలో మార్పులు చేయడం, రీ షూట్ చేయడం అనేది సాధ్యం కాదని నట్టి కుమార్ అన్నారు.