‘నీ కథలో నువ్వే రాజువి’ అంటున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న‘మీకు మాత్రమే చెప్తా’ మూవీ నుండి ‘కథ చెబుతా విను’ వీడియో సాంగ్ విడుదల.. నవంబర్ 1న సినిమా రిలీజ్..

విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న‘మీకు మాత్రమే చెప్తా’ మూవీ నుండి ‘కథ చెబుతా విను’ వీడియో సాంగ్ విడుదల.. నవంబర్ 1న సినిమా రిలీజ్..
విజయ్ దేవరకొండ నిర్మాతగా ‘ఏ కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్’ బ్యానర్‌పై, తరుణ్ భాస్కర్‌ని హీరోగా, షమ్మీర్ సుల్తాన్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల మహేష్ బాబు రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. రీసెంట్‌గా ఈ సినిమా నుండి ‘కథ చెబుతా విను’ అంటూ సాగే వీడియో సాంగ్ విడుదల చేశారు. 200 మంది విజయ్ ఫ్యాన్స్ ఆధ్వర్వంలో ఈ సాంగ్ లాంచ్ చేశారు.
శివకుమార్ ట్యూన్, షమ్మీర్ సుల్తాన్, రాకేందు మౌళి లిరిక్స్, అనురాగ్ కులకర్ణి, రాహుల్ సిప్లిగంజ్ వాయిస్, అసుర ర్యాప్ ఈ పాటకు ప్లస్ అయ్యాయి. తరుణ్ భాస్కర్, అభినవ్ టాస్ వేయడంతో స్టార్ట్ అయిన ఈ పాటలో విజయ్ దేవరకొండ హైలెట్ అయ్యాడు.. రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్‌లో పిక్చరైజ్ చేశారు. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి..
Read Also : ఎస్.ఆర్.సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘శివన్’ ట్రైలర్ లాంచ్!
తరుణ్ భాస్కర్, అభినవ్ గౌతమ్, అనసూయ భరద్వాజ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ, జీవన్ ఇతర పాత్రల్లో నటించారు. నవంబర్ 1న ‘మీకు మాత్రమే చెప్తా’ విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, సంగీతం : శివకుమార్, ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని, నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ, రచన-దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్.