Adavallu Meeku Joharlu: శర్వా – రష్మిక ఫ్యాన్స్‌కు వాలంటైన్స్ డే ట్రీట్.. ఓ మై ఆద్యా..!

ర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు..

Adavallu Meeku Joharlu: శర్వా – రష్మిక ఫ్యాన్స్‌కు వాలంటైన్స్ డే ట్రీట్.. ఓ మై ఆద్యా..!

Adavallu Meeku Joharlu

Updated On : February 14, 2022 / 7:57 PM IST

Adavallu Meeku Joharlu: శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రిలీజ్ టైం దగ్గర పడేకొద్దీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన యూనిట్ వరసగా సాంగ్స్, టీజర్లు రిలీజ్ చేస్తుంది.

ఇప్పటికే ఆడవాళ్లు మీకు జోహార్లు.. అంటూ సాగే టైటిల్ సాంగ్ విడుదల చేయగా.. వాలంటైన్ డే సందర్భంగా మరో పాట రిలీజ్ చేశారు. ఓ.. మై ఆద్యా.. అంటూ సాగిన ఈ సాంగ్.. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ మార్క్ మెలోడీతో ఆకట్టుకుంటోంది. ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజైన ఈ లవ్లీ సాంగ్ లో.. మెలోడీ.. బీట్ తో కో ఆర్డినేట్ చేస్తూ ఇంప్రెస్ చేస్తోంది. పాటకు తగ్గట్టుగా కుదిరిన సింపుల్ స్టెప్స్.. నేషనల్ క్రష్ రష్మిక అందాలు.. శర్వా జోష్.. అన్నీ కలిపి ఫ్యాన్స్ తో సింప్లీ సూపర్బ్ అనిపిస్తున్నాయి.

తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మెయిన్ అసెట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. చాలా కాలం తర్వాత స్వయంగా దేవిశ్రీ పాడిన టైటిల్ సాంగ్.. ఇప్పటికే బ్లాక్ బస్టర్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు విడుదల చేసిన.. ఓ.. మై ఆద్యా.. పాట కూడా మ్యూజిక్ లవర్స్ ను ఫ్లాట్ చేసేస్తోంది. రికార్డ్ వ్యూస్ దక్కించుకొనేలా కనిపిస్తుంది.