Movie Releases : ఈ వారం తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

దసరా సినిమాలు ఇంకా థియేటర్స్ లో నడుస్తూనే ఉన్నాయి. దీంతో ఈ వారం అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి.

October last Week Theatrical Releasing Movies

Movie Releases : గత వారం దసరా పండుగ ఉండటంతో స్టార్ హీరోలు వచ్చి సందడి చేశారు. బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో రాగా విజయ్ డబ్బింగ్ సినిమా లియోతో వచ్చాడు. ఈ మూడు సినిమాలు థియేటర్స్ లో మంచి విజయం సాధించాయి. ఈ సినిమాలు ఇంకా థియేటర్స్ లో నడుస్తూనే ఉన్నాయి. దీంతో ఈ వారం అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి.

సంపూర్ణేష్ బాబు హీరోగా పూజ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ కానుంది. తమిళ సినిమా మండేలాకు రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు.

కార్తీక్ రత్నం హీరోగా ఆనంద్ బడే దర్శకత్వంలో తెరకెక్కిన లింగోచ్చా సినిమా అక్టోబర్ 27న రిలీజ్ అవుతుంది.

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా శ్రీని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ సినిమా ఘోస్ట్ ఆల్రెడీ కన్నడలో దసరాకు గత వారం రిలీజవ్వగా తెలుగులో ఈ వారం అక్టోబర్ 27న రిలీజ్ కానుంది.

Also Read : Shraddha Kapoor : ఖరీదైన కార్ కొన్న బాలీవుడ్ హీరోయిన్.. వామ్మో ఒక్క కారుకే అన్ని కోట్లా?

ఇవే కాక.. ఓటు, ధీమహి, ఒక్కడే.. లాంటి చిన్న సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.