Shraddha Kapoor : ఖరీదైన కార్ కొన్న బాలీవుడ్ హీరోయిన్.. వామ్మో ఒక్క కారుకే అన్ని కోట్లా?

తాజాగా శ్రద్దా కపూర్ పేరు వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఈ అమ్మడు ఒక ఖరీదైన కారు కొనడమే.

Shraddha Kapoor : ఖరీదైన కార్ కొన్న బాలీవుడ్ హీరోయిన్.. వామ్మో ఒక్క కారుకే అన్ని కోట్లా?

Shraddha Kapoor buys a Lamborghini Car with High cost

Updated On : October 25, 2023 / 12:41 PM IST

Shraddha Kapoor : బాలీవుడ్(Bollywood) లో సీనియర్ నటుడు శక్తి కపూర్ కూతురిగా తీన్ పత్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రద్దా కపూర్. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ, స్టార్ హీరోల సరసన నటిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది శ్రద్దా కపూర్. తెలుగులో ప్రభాస్ సరసన సాహో(Saaho) సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులని మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది శ్రద్దా.

అయితే తాజాగా శ్రద్దా కపూర్ పేరు వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఈ అమ్మడు ఒక ఖరీదైన కారు కొనడమే. అత్యంత ఖరీదైన కార్లను ఉత్పత్తి చేసే లంబోర్గిని(Lamborghini) కంపెనీకి చెందిన హురాకాన్ టెక్నికా మోడల్ కారుని కొనుక్కుంది శ్రద్దా. ఆ కారు ధర దాదాపు 4 కోట్ల రూపాయల పైనే ఉండటం గమనార్హం. దీంతో ఇంత ఖరీదు పెట్టి ఒక కార్ కొందా శ్రద్దా కపూర్ అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Bhagavanth Kesari : ఆరు రోజుల్లోనే సెంచరీ కొట్టిన భగవంత్ కేసరి.. హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న బాలయ్య బాబు..

శ్రద్దా కపూర్ ఫ్రెండ్, ముంబైలో లంబోర్గిని కార్స్ అమ్మే సంస్థ యజమాని పూజ చౌదరి లంబోర్గిని కారు, శ్రద్దా కపూర్ తో ఫోటో దిగి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలని షేర్ చేస్తూ.. ఇవాళ నాకు నిజంగా ప్రత్యేకమైన క్షణం. చాలా ట్యాలెంటెడ్ పర్సన్ శ్రద్దా కపూర్ కి ఈ కార్ అమ్ముతున్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా నా కంపెనీని నిలబెట్టిన ప్రయాణం గురించి తనకి చెప్పి ఎమోషనల్ అయ్యాను. ఒక లంబోర్గిని కార్ ఒక గొప్ప మహిళకు అమ్ముతున్నాం. ఇది సూపర్ కార్ మాత్రమే కాదు, మహిళలు మీ కలలను నెరవేర్చుకోవడానికి ఒక చిహ్నం. మహిళలందరికీ శ్రద్దా కపూర్ ప్రయాణం స్ఫూర్తివంతంగా ఉండాలి అని పోస్ట్ చేసింది.