og business
OG Business : చాలా ఏళ్ళ తర్వాత ఇండస్రీలో ఓ సినిమాకు భారీ హైప్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ తోనే సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టేస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఇలా ఓపెన్ చేయగానే అలా అయిపోయాయి. ఫ్యాన్స్ OG సినిమా చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్నారు.(OG Business)
OG సినిమాకు ఉన్న హైప్ తో ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగా జరిగింది. OG సినిమాకు ప్రపంచవ్యాప్తంగా థియేటరికల్ బిజినెస్ ఆల్మోస్ట్ 175 కోట్లకు జరిగింది. దీంతో ఈ సినిమా టార్గెట్ పెద్దగానే ఉంది. అయితే థియేట్రికల్ కాకుండా నాన్ థియేట్రికల్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తుంది.
OG సినిమాను దాదాపు 80 కోట్లకు పైగా ఇచ్చి ఓ ఓటీటీ కొనుక్కుందట. సినిమా రిలీజ్ తర్వాత హిట్ రిజల్ట్ వస్తే ఆ మొతం ఇంకా పెంచేలా ఒప్పందం కూడా చేసుకున్నారట. ఇక ఆడియో రైట్స్ 16 కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్లకు అమ్మాయుడయ్యాయని సమాచారం. ఇంకా శాటిలైట్ హక్కులు అమ్మలేదట. సినిమాకి హైప్ ఉంది కాబట్టి రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ అయ్యాక ఇంకా ఎక్కువ ధరకు అమ్మాలని చూస్తున్నారు. ఎంత కాదనుకున్నా శాటిలైట్ రైట్స్ కనీసం 10 కోట్లకు పైనే అమ్ముడుపోతాయని తెలుస్తుంది.
ఈ లెక్కన OG సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 120 కోట్ల వరకు జరిగినట్టే. ఇక థియేట్రికల్ బిజినెస్ 175 కోట్లు కలుపుకొని మొత్తంగా 295 కోట్ల వరకు OG సినిమాకు బిజినెస్ జరిగింది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు. దీంతో రిలీజ్ కి ముందే ప్రాఫిట్స్ లో ఉంది ఈ సినిమా.
Also Read : OG Mania : టాలీవుడ్ లో కూడా OG మానియా.. OG హుడీలతో నిర్మాతలు హడావిడి..