OG Mania : టాలీవుడ్ లో కూడా OG మానియా.. OG హుడీలతో నిర్మాతలు హడావిడి..

OG సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినిమా లవర్స్, సాధారణ ప్రేక్షకులు, టాలీవుడ్ జనాలు కూడా ఎదురుచూస్తున్నారు. (OG Mania)

OG Mania : టాలీవుడ్ లో కూడా OG మానియా.. OG హుడీలతో నిర్మాతలు హడావిడి..

OG Mania

Updated On : September 24, 2025 / 10:03 AM IST

OG Mania : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న OG సినిమా రేపు సెప్టెంబర్ 25 రిలీజ్ కానుంది. ఇటీవల కాలంలో ఏ సినిమాకి రానంత హైప్ ఈ సినిమాకు వచ్చింది. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని అందరూ ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఒక హీరో సినిమాకు ఫ్యాన్స్ హైప్ ఫీల్ అవ్వడం, సందడి చేయడం మాములే.(OG Mania)

కానీ OG సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినిమా లవర్స్, సాధారణ ప్రేక్షకులు, టాలీవుడ్ జనాలు కూడా ఎదురుచూస్తున్నారు.

Also Read : Mirai : పవర్ స్టార్ మీద అభిమానంతో.. ఆపేస్తున్న మిరాయ్ సినిమా.. హీరో, నిర్మాతల నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా..

ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, సిద్ధూ జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, రితిక నాయక్.. పలువురు హీరోలు, హీరోయిన్స్, యువ దర్శకులు, సింగర్స్.. అంతా OG సినిమా గురించి మాట్లాడి, ట్వీట్స్ వేసి హైప్ మరింత పెంచారు. ఇప్పుడు నిర్మాతలు కూడా OG మానియాలో భాగం అయ్యారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ సమయంలో నిర్మాత నాగవంశీ OG హుడీ వేసుకొని వెనక్కి తిరిగి ఫోటో షేర్ చేసారు.

OG సినిమాని నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తుండంతో నిర్మాత దిల్ రాజు, శిరీష్ OG హుడీ వేసి స్పెషల్ వీడియో చేసి పవన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. టాలీవుడ్ లో కూడా తెర వెనుక పనిచేసే వాళ్ళ దగ్గర్నుంచి తెరపై స్టార్ డమ్ ఉన్నవాళ్ళంతా పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా చూశాక టాలీవుడ్ నుంచి ఇంకా ఎవరెవరు స్పందిస్తారో చూడాలి.

Also Read : NTR : ఖర్చు ఎక్కువ అవుతుందని.. గాయంతోనే షూటింగ్ చేసిన ఎన్టీఆర్..