×
Ad

OG Collections : OG ఫస్ట్ డే కల్క్షన్స్ ఎన్ని కోట్లు..? పవర్ స్టార్ కెరీర్ హైయెస్ట్..

కలెక్షన్స్ కూడా అడ్వాన్స్ సేల్స్ నుంచే అదిరిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్ తోనే OG సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. (OG Collections)

OG Collections

OG Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా నిన్న రిలీజయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది OG సినిమా. ఇటీవల కాలంలో ఈ సినిమాకు వచ్చినంత హైప్ ఏ సినిమాకు రాలేదు. దీంతో ఫ్యాన్స్, సినిమా లవర్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు, టాలీవుడ్ జనాలు కూడా OG సినిమాని చూడటానికి ఎగబడ్డారు.(OG Collections)

ఇక కలెక్షన్స్ కూడా అడ్వాన్స్ సేల్స్ నుంచే అదిరిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్ తోనే OG సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం అడ్వాన్స్, ప్రీమియర్స్ బుకింగ్స్ తోనే OG సినిమా రిలీజ్ కి ముందే దాదాపు 90 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో రిలీజ్ కి ముందే 2.9 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. దీంతో OG సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో అని ఎదురుచూస్తున్నారు.

Also Read : They Call Him OG : ‘ఓజీ’ మూవీ రివ్యూ.. ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే.. ఓజస్ గంభీర విధ్వంసం..

బాక్సాఫీస్ సమాచారం ప్రకారం OG సినిమా ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ కలుపుకొని దాదాపు 150 కోట్ల గ్రాస్ కి పైగా వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన ఎంతొచ్చినా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ అవుతుంది OG సినిమా. అధికారికంగా నిర్మాణ సంస్థ ఇంకా OG మొదటి రోజు కలెక్షన్స్ ప్రకటించలేదు. 2025 లో ఇప్పటివరకు హైయెస్ట్ ఓపెనింగ్ కూలి సినిమా 151 కోట్లు. ఈ సినిమాని OG బీట్ చేస్తుందని భావిస్తున్నారు. మరి అధికారిక లెక్కలు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

అమెరికాలో అధికారికంగానే 3.4 మిలియన్ డాలర్స్ వసూలు చేసిందని ప్రకటించారు. అంటే ఆల్మోస్ట్ 26 కోట్లకు పైగా నార్త్ అమెరికా నుంచే వచ్చింది. ఇక నైజాంలో దాదాపు 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని సమాచారం. మొత్తానికి OG సినిమాతో పవన్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ హిట్ వచ్చేసింది అని సంబరపడుతున్నారు.

Also See : ఓజీ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్… ఈ ఫోటోలు చూశారా?