‘ఆలోచిస్తేనే నాన్న పేరు.. రాలుతుంది నా హెయిర్ – ఓ మై గాడ్ డాడీ’ ఫుల్ సాంగ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న‘అల వైకుంఠపురములో’ నుండి ‘ఓ మైగాడ్ డాడీ’ ఫుల్ సాంగ్ రిలీజ్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న‘అల వైకుంఠపురములో’ నుండి ‘ఓ మైగాడ్ డాడీ’ ఫుల్ సాంగ్ రిలీజ్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. అల్లు అరవింద్, ఎస్.రాధకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘అల వైకుంఠపురములో’… ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి.. చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా ‘ఓ మైగాడ్ డాడీ’ అనే సాంగ్ టీజర్ విడుదల చేయగా బన్నీ పిల్లలు చేసిన సందడి చూసి ప్రేక్షకులు మురిసిపోయారు.
శుక్రవారం సాయంత్రం పూర్తి పాట రిలీజ్ చేశారు. థమన్ కంపోజ్ చేసిన ట్యూన్‌కి కృష్ణ చైతన్య లిరిక్స్, తెలుగు ర్యాప్ రాయగా.. రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. తెలుగు ర్యాప్ రోల్ రిడా, ఇంగ్లీష్ ర్యాప్ రాహుల్ నంబియార్, ఫీమేల్ ర్యాప్ లేడీ కష్ పాడారు. బన్నీ డిఫరెంట్ స్టైల్‌లో కనిపిస్తున్నాడీ పాటలో..
Read Also : ‘‘భయపడే వాడే బేరానికొస్తాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా’’..
మిడిల్ క్లాస్ తండ్రి గురించి తన కొడుకు పడే ఆవేదన అంతా ఈ పాటలో కనిపిస్తోంది.. ప్రతి పదంలోనూ వినిపిస్తోంది. ఇలా నాన్నల్ని తిట్టుకునే మిడిల్ క్లాస్ కొడుకులందరూ ఈ పాటకు కనెక్ట్ అవుతారు. ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.