Chandrayaan 3: చంద్రయాన్-3 ల్యాండింగ్ వేళ ఈ హీరోయిన్ బయటకు రావద్దు: నెటిజన్లు
ఆకాశం నుంచి జాబిల్లి దిగివచ్చి ఈ నేలమీది చందమామకు ఓ మాట చెప్పాలని ఫ్యాన్స్ వేడుకుంటున్నారు.

Chandrayaan 3 – Shraddha Kapoor: చంద్రయాన్-3 ల్యాండింగ్ అయ్యే వేళ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇంట్లోంచి బయటకు రావద్దని నెటిజన్లు ఒకటే గోల చేస్తున్నారు. గత రాత్రి నుంచి ఇదే తీరు. ఎందుకోతెలుసా?
సిల్వర్ కలర్ హాల్టర్ నెక్ టాప్, దానికి మ్యాచ్ అయ్యే సిల్వర్ కలర్ లెథర్ ప్యాంట్ వేసుకుని తాజాగా శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్ చేసింది. ఎదుగుతూనే ఉండాలని పేర్కొంటూ రాకెట్, నక్షత్రాల ఎమోజీలను ఆమె జోడించింది. ఈ నేలమీది జాబిల్లి అందాన్ని చూసి నెటిజన్లు తమను తాము మైమరచిపోతున్నారు.
ఇక చంద్రయాన్-3లోని ల్యాండర్, రోవర్ కూడా అసలైన చంద్రుడిని మర్చిపోయి, శ్రద్ధా కపూరే నిజమైన చందమామ అనుకుని ఆమెపై అవి ల్యాండ్ అయ్యే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. అంతలా శ్రద్ధా కపూర్ మెరిసిపోతుంటే అందరూ చంద్రుడిని చూడడం మానేసి ఈమెనే చూస్తూ కూర్చుకుంటారని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆమెని చూస్తే చంద్రయాన్-3 గురి తప్పుతుందని దయచేసి బయటకు రావద్దని మరో ఫ్యాన్ కోరారు. చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండ్ అవుతున్న వేళ శ్రద్ధా కపూర్ అందరి దృష్టినీ ఆకర్షించిన తీరు అబ్బురపరుస్తోంది.
View this post on Instagram
Chandrayaan-3 Mission : చంద్రయాన్ మిషన్‌కు పాక్ మాజీ మంత్రి ప్రశంసలు