×
Ad

Mahesh Babu : వామ్మో అప్పట్లోనే కోటి రూపాయలు పెట్టి.. 300 మందితో.. మహేష్ సినిమా కోసం..

మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు. (Mahesh Babu)

Mahesh Babu

Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతుంది. మహేష్ కెరీర్లో ఉన్న సూపర్ హిట్ సినిమాల్లో ఒక్కడు ఒకటి. గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించి మహేష్ ని స్టార్ చేసింది.(Mahesh Babu)

ఒక్కడు సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టి చార్మినార్ సెట్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ అప్పటి సంగతులు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గుణశేఖర్ త్వరలో యుఫోరియా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒక్కడు సినిమా గురించి మాట్లాడారు.

Also Read : Arijit Singh : ఫుల్ ఫామ్ లో ఉండగా 38 ఏళ్లకే.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ సింగర్.. బాధలో ఫ్యాన్స్..

గుణశేఖర్ మాట్లాడుతూ.. చార్మినార్ సెట్ కి దాదాపు కోటి పైనే ఖర్చు అయింది. నిర్మాత కూడా ఎంతైతే అంత అని పెట్టారు. నాలుగు నెలల పాటు 300 మంది ఆ సెట్ కోసం పనిచేసారు. కానీ కొన్ని సీన్స్ రియల్ చార్మినార్ దగ్గరే తీసాము. చార్మినార్ కింద భూమిక మహేష్ పరిగెసుతుంటే పోలీసుల ఫోర్స్ రావడం, భూమిక, మహేష్ పైకి వెళ్లే సీన్స్, కొన్ని లీడ్స్.. అవన్నీ రియల్ చార్మినార్ దగ్గర చేసాం. కానీ ఇక్కడ ఉదయం పూటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఉదయాన్నే షూటింగ్ చేసేవాళ్ళం. 7.30 లోపు షూటింగ్ ముగించేయాలి. ఒక మూడు రోజులు రియల్ చార్మినార్ దగ్గర షూటింగ్ చేసాం అని తెలిపారు.

Also Read : Anjali : ఓ వైపు అమ్మ మరణం.. ఇంకో వైపు రెండో డెలివరీ.. తల్లిని గుర్తుచేసుకుంటూ అంజలి ఎమోషనల్..