రజినీ సినిమాకి రెండు థియేటర్లేనా?
పేట వచ్చిన తర్వాత రోజు వినయ విధేయ రామ, దాని తర్వాత ఎఫ్2 సినిమాలు రిలీజవుతుండడంతో, రెండవ రోజునుండి కేవలం రెండంటే రెండు థియేటర్లకే పరిమితం కానుంది.

పేట వచ్చిన తర్వాత రోజు వినయ విధేయ రామ, దాని తర్వాత ఎఫ్2 సినిమాలు రిలీజవుతుండడంతో, రెండవ రోజునుండి కేవలం రెండంటే రెండు థియేటర్లకే పరిమితం కానుంది.
ఈ సంక్రాంతికి, ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్2 సినిమాలతో పాటు, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తమిళ సినిమా పేట్టా, తెలుగులో పేటగా రిలీజ్ అవబోతున్న సంగతి తెలిసిందే. అయితే, మొన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పేటని తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత అశోక్ వల్లభనేని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ సంఘటన గురించి ఫిల్మ్‌నగర్‌లో చర్చలు జరుగుతుండగానే, పేట గురించిన మరో వార్త సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది. సూపర్ స్టార్ సినిమాకి హైదరాబాద్‌లో కేవలం రెండే రెండు థియేటర్లే ఉన్నయాంట.
మొదటిరోజు ఓమోస్తరు థియేటర్స్‌లో రిలీజ్ చేస్తుండగా, పేట వచ్చిన తర్వాత రోజు వినయ విధేయ రామ, దాని తర్వాత ఎఫ్2 సినిమాలు రిలీజవుతుండడంతో, రెండవ రోజునుండి కేవలం రెండంటే రెండు థియేటర్లకే పరిమితం కానుంది. వాటిలో ఒకటి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సప్తగిరి థియేటర్, ఇంకోటి మల్కాజ్‌గిరి రాఘవేంద్ర థియేటర్.. కూకట్‌పల్లి, దిల్‌షుక్‌నగర్ లాంటి ఏరియాల్లో సింగిల్ స్క్రీన్లూ, మల్టీప్లెక్స్‌లు ఉన్నా, పేటకి మాత్రం స్పేస్ దొరకలేదు. దీనిపై పేట నిర్మాతఅశోక్ వల్లభనేని ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.
వాచ్ పేటా తెలుగు ట్రైలర్…