హ్యాపీ బర్త్‌డే థమన్ – ‘ఓ బావా’ సాంగ్ ప్రోమో

సంగీత దర్శకుడ థమన్ బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ఓ బావా’ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు..

  • Published By: sekhar ,Published On : November 16, 2019 / 04:24 AM IST
హ్యాపీ బర్త్‌డే థమన్ – ‘ఓ బావా’ సాంగ్ ప్రోమో

Updated On : November 16, 2019 / 4:24 AM IST

సంగీత దర్శకుడ థమన్ బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ఓ బావా’ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

ఇటీవల విడుదల చేసిన ‘పది మంది ఉండగా.. ప్రతిరోజు పండగే’.. టైటిల్ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. సంగీత దర్శకుడ థమన్ బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ఓ బావా’ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. కుటుంబ విలువలు, భావోద్వేగాలు ప్రధానంగా రూపొందుతున్న ‘ప్రతిరోజూ పండగే’.. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.

Read Also : ‘తంబీ’ – ‘దొంగ’ టైటిల్, ఫస్ట్‌లుక్

డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. విజయ్ కుమార్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.. సంగీతం : థమన్, కెమెరా : జయ కుమార్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : రవీందర్, నిర్మాత : బన్నీ వాసు.