ట్రైలర్ – చైన్నై చెక్కేసి రామరాజ్ బనియన్‌లు అమ్ముకోమ్మా!

నవీన్ విజయ్ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ నటించిన 'ఊరంతా అనుకుంటున్నారు'.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : October 1, 2019 / 07:13 AM IST
ట్రైలర్ – చైన్నై చెక్కేసి రామరాజ్ బనియన్‌లు అమ్ముకోమ్మా!

Updated On : October 1, 2019 / 7:13 AM IST

నవీన్ విజయ్ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ నటించిన ‘ఊరంతా అనుకుంటున్నారు’.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

నవీన్ విజయ్ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ ప్రధాన తారాగణంగా.. బాలాజీ సానల దర్శకత్వంలో, రోవాస్కైర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై.. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి సంయుక్తంగా నిర్మించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఊరంతా అనుకుంటున్నారు’..

ఇటీవలే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మూవీ చూసిన సెన్సార్ టీమ్ క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది. రీసెంట్‌గా ‘ఊరంతా అనుకుంటున్నారు’.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ బాగుందని, మూవీ టీమ్‌ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. పల్లెటూరి నేపథ్యంలో, బంధాలు, అనుబంధాల ప్రధానంగా సాగే కుటుంబకథా చిత్రమిదని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

Red Also : సత్యమేవ జయతే 2 – ఫస్ట్ లుక్..

రావు రమేష్ క్యారెక్టర్ ఆయన చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.. ‘సహజనటి’ జయసుధ, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటించారు.. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న ‘ఊరంతా అనుకుంటున్నారు’.. విడుదల కానుంది. సంగీతం : కె.ఎమ్.రాధాకృష్ణ‌, కెమెరా : జి.ఎల్.ఎన్.బాబు, ఎడిటింగ్ : మధు