Operation Sindhoor : ‘ఆపరేషన్ సింధూర్’ సాంగ్ విడుదల.. దేశభక్తి పెంపొందించేలా..

దేశభక్తిని పెంపొందించే ఆపరేషన్ సింధూర్ సాంగ్ మీరు కూడా వినేయండి..

Operation Sindoor Song Released by Ali and JD Lakshmi Narayana

Operation Sindhoor : ఇటీవల ఉగ్రవాదులు పహల్గామ్ లో దాడి చేయగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర పేరుతో పలు ఉగ్ర స్థావరాలను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని లక్ష్మణ్ పూడి తన దేశభక్తిని ఓ పాట రూపంలో చిత్రీకరించారు. ఈ పాటకు ప్రసాద్ లిరిక్స్ రాయగా రమేష్ సంగీతంలో లక్ష్మణ్ పూడి పాడారు. ఉమా శంకర్ కొరియోగ్రఫీ చేసారు. తాజాగా ఈ సాంగ్ లంచ్ ఈవెంట్ నిర్వహించగా జెడి లక్ష్మీనారాయణ, అలీ, మేజర్ ఒబెరాయ్, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్.. పలువురు హాజరయ్యారు.

దేశభక్తిని పెంపొందించే ఆపరేషన్ సింధూర్ సాంగ్ మీరు కూడా వినేయండి..

ఈ సాంగ్ లంచ్ ఈవెంట్లో జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… లక్ష్మణ్ ఆపరేషన్ సింధూర్ పై పాట రాసి దేశంలోని జవాన్ల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని చూపించారు. గడియారంలో మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసే సమయానికి ముల్లులు నమస్కరిస్తూ రైతులకు గౌరవం ఇస్తాయి. రాత్రి 12 గంటలకు మన ప్రశాంతంగా పడుకోవడానికి గల కారణంమైన జవాన్లకు మరోసారి అదే గడియారంలోని ముల్లులు నమస్కరిస్తూ వారికి గౌరవం ఇస్థాయి. కొన్ని దేశాలలో కచ్చితంగా అందరూ రెండేళ్లు మిలటరీలో ఉంటారు. అదే రూల్ మనదేశంలో కూడా ఉండాలి.

Also Read : Akhil Akkineni : అఖిల్ పెళ్లి త్వరలోనే..? ఆ డేట్ లోనే అంటూ రూమర్స్..

నటుడు అలీ మాట్లాడుతూ… లక్ష్మణ్ గారు అందరికీ ఉపయోగపడేలా ఆరోగ్యాన్ని పంచుతున్నారు. ఈరోజు స్టేజిపై ఉన్న రియల్ హీరోలను కలవడం సంతోషాన్ని కలగజేస్తుంది. లక్ష్మణ్ గారిలో ఒక మంచి గాయకుడున్నాడు, నటుడు ఉన్నాడు అన్నారు. మేజర్ ఒబెరాయ్ మాట్లాడుతూ… నేను ఆపరేషన్స్ సింధూర్ గురించి మాట్లాడినప్పుడు ప్రజలు నేను మాట్లాడిన విషయాలను బాగా యాక్సెప్ట్ చేశారు. లక్ష్మణ్ గారు అందించిన పాట చాలా బాగుంది. అవసరమైతే దేశం కోసం మనమంతా జవాన్ల వలే ముందుకు వెళ్లాలి. ప్రపంచంలోనే మన ఆర్మీ ఎంతో బలమైనది అని తెలిపారు.

ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ… దేశం కోసం చిన్నప్పటినుండి ఏదో ఒకటి చేయాలి అని ఉండేది. నేడు నా ఏజ్ 56 ఏళ్ళు. ఇంత ఆరోగ్యకరంగా ఉండటానికి గల కారణం డైట్. మన ఆరోగ్య విధాలను మంచిగా ఉండేలా చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు అయినా ఆరోగ్యంగానే ఉంటాము. ఆరోగ్య డైట్ కంటే ముందే నాలో ఒక విప్లవ కళాకారుడు, ఒక గాయకుడు, ఒక రచయిత ఉన్నాడు. మిలటరీ మాధవపురం అనే ఊరుకు ప్రతి సంవత్సరం వెళ్లి పాటలు పడేవాళ్ళం. వాళ్లే మాకు ఇన్స్పిరేషన్. దేశం కోసం ఏమైనా చేయాలి, అందరికీ ఒక స్ఫూర్తినివ్వలని అనే ఉద్దేశంతో ఈ పాటను చేశాను. ఈ పాటను మురళి నాయక్ కుటుంబానికి అంకితం చేస్తున్నాను అని తెలిపారు.

Also Read : Seetha Payanam : యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు హీరోయిన్ గా.. ‘సీతా పయనం’ టీజర్ రిలీజ్..