Akhil Akkineni : అఖిల్ పెళ్లి త్వరలోనే..? ఆ డేట్ లోనే అంటూ రూమర్స్..

తాజాగా వీరి పెళ్లి గురించి టాక్ వినిపిస్తుంది.

Akhil Akkineni : అఖిల్ పెళ్లి త్వరలోనే..? ఆ డేట్ లోనే అంటూ రూమర్స్..

Akhil Akkineni Zainab Ravdjee Will Marry Soon

Updated On : May 28, 2025 / 5:33 PM IST

Akhil Akkineni : గత సంవత్సరం నవంబర్ లో అక్కినేని అఖిల్ జైనబ్ రవ్జీ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించాడు. జైనబ్ రవ్జీ అనే అమ్మాయిని అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం.

నిశ్చితార్థం తర్వాత ఈ ప్రేమ పక్షులు పలుమార్లు మీడియా కంట పడ్డారు. ఇటీవల విదేశాలకు వెళ్లి జైనాబ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. అయితే తాజాగా వీరి పెళ్లి గురించి టాక్ వినిపిస్తుంది.

Also Read : Seetha Payanam : యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు హీరోయిన్ గా.. ‘సీతా పయనం’ టీజర్ రిలీజ్..

అఖిల్ – జైనాబ్ ల పెళ్లి జూన్ 6న జరగబోతుందని సమాచారం. హైదరాబాద్‌ లేదా రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరుగుతుందని టాలీవుడ్ లో వినిపిస్తుంది. కేవలం ఇటు కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి వేడుక జరగనుందని తెలుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అక్కినేని ఫ్యామిలీ ఈ రూమర్ పై స్పందిస్తుందేమో చూడాలి.