Golden Globe Awards 2024 : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ఓపెన్‌హైమర్.. ఐదు విభాగాల్లో అవార్డుల పంట
81 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం కాలిఫోర్నియాలోని బ్లేవరీ హిల్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. క్రిస్టఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన 'ఓపెన్‌హైమర్' మూవీ ఐదు కేటగిరిల్లో అవార్డులు దక్కించుకుంది.

Golden Globe Awards 2024
Golden Globe Awards 2024 : ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ‘ఓపెన్‌హైమర్’ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2024 లో సత్తా చాటింది. 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఓపెన్‌హైమర్‌కు ఐదు విభాగాల్లో అవార్డుల పంట పండింది.
Surekhavani : తిరుమల శ్రీవారికి తలనీలాలు అర్పించిన నటి.. గుండుతో సురేఖవాణి..
అణుబాంబు సృష్టికర్త ఓపెన్‌హైమర్ జీవిత కథను ‘ఓపె హైమర్’ గా తెరకెక్కించారు ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్. 2023 లో విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమా 2024 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీ, ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్, ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ లుడ్విగ్ గోరాన్సన్, ఉత్తమ చిత్రం కేటరిగిల్లో ఓపెన్‌హైమర్‌కు అవార్డులు దక్కాయి. ఓపెన్‌హైమర్ పాత్రలో సిలియన్ మర్ఫీని తప్ప వేరొకరిని ఊహించలేం అన్నంతగా అద్భుతంగా నటించారు.
కాగా ‘కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ సినిమాకి గానూ ఉత్తమ నటిగా లిల్లీ గ్లాడ్‌స్టోన్ గెలుచుకున్నారు. ఉత్తమ హాస్య నటిగా ఎమ్మా స్టోన్, ఉత్తమ హాస్య నటుడిగా పాల్ గియామట్టి అవార్డు అందుకున్నారు. ‘బార్బీ’ సినిమాకు పలు కేటగిరిల్లో అవార్డులు వచ్చాయి.
OG Movie : OG ఎప్పటికీ మాదే.. సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన డీవీవీ సంస్థ
గోల్డెన్ గ్లోబ్ విజేతలు వీరే
ఉత్తమ చిత్రం-ఓపెన్‌హైమర్
ఉత్తమ ఆంగ్లేతర చిత్రం-అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
బాక్సాఫీస్ అచీవ్ మెంట్ అవార్డు-వార్నర్ బ్రదర్స్ (బార్బీ)
ఉత్తమ యానిమేటెడ్ చిత్రం-ది బాయ్ అండ్ ది హెరాన్
ఉత్తమ దర్శకుడు-క్రిస్టఫర్ నోలన్(ఓపెన్‌హైమర్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే-జస్టిన్ సాగ్, ఆర్ధర్ హరారి (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
ఉత్తమ నటుడు-సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ నటి-లల్లీ గ్లాడ్‌స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
ఉత్తమ హాస్య నటి-ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ హాస్య నటుడు-పాల్ గియామట్టి (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటి-డావిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటుడు-రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్-వాట్ వాస్ ఐ మేడ్ (బార్బీ)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్-లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)