Oscar 2023 Live Performances full list and details
Oscar Live Performances : మరికొద్ది గంటల్లో ఆస్కార్ వేడుక జరగబోతుంది. ప్రపంచ సినీ ప్రేమికులంతా ఈ అవార్డు వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం భారతదేశం నుంచి బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా మారింది. అంతే కాక మన RRR యూనిట్ లో చాలా మంది ఆస్కార్ వేడుకలకు హాజరు కాబోతున్నారు. మనకు ఈ సారి మరింత స్పెషల్ అవ్వనుంది ఆస్కార్ కార్యక్రమం. ఎందుకంటే ఆస్కార్ వేదికపై మన నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.
ఆస్కార్ వేదికపై ప్రతి సంవత్సరం కొన్ని లైవ్ పర్ఫార్మెన్స్ లు ఇస్తారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచిన పాటలను కచ్చితంగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఆస్కార్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలో మన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలవగా ఆస్కార్ వేదికపై సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి ఈ పాటను పాడనున్నారు. అయితే కీరవాణి లైవ్ మ్యూజిక్ ఇస్తారా లేదా మ్యూజిక్ ట్రాక్ కి రాహుల్, భైరవ కలిసి పాడతారా అనేది ఇంకా తెలియదు. అలాగే నాటు నాటు సాంగ్ కి అమెరికన్ డ్యాన్సర్ అయిన లారెన్ గోట్లిబ్ ఆస్కార్ స్టేజిపై పర్ఫార్మెన్స్ ఇవ్వనుంది. ఈమె పలు ఇండియన్ సినిమాల్లో కూడా నటించింది. ఇండియన్ టీవీ షోలలో పాల్గొంది.
అలాగే నాటు నాటు సాంగ్ తో పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన మరో నాలుగు పాటల్లో మూడు పాటలను కూడా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. సోఫియా కార్సన్, డయానా వారెన్ కలిసి Tell it Like A Woman సినిమా నుంచి applause సాంగ్ ని ఆస్కార్ వేదికపై పర్ఫార్మ్ చేయనున్నారు. రిహన్న Black Panther : Wakanda forecer సినిమా నుంచి Lift me up సాంగ్ ని పర్ఫార్మ్ చేయనుంది. డేవిడ్ బైర్నే, సన్ లక్స్, స్టెఫానియె హెసు కలిసి Everything Everywher all at Once సినిమా నుంచి This is a Life సాంగ్ ని ఆస్కార్ వేదికపై పర్ఫార్మ్ చేయనున్నారు.
టామ్ క్రూయిజ్ నటించిన Top Gun : Maveric సినిమా నుంచి Hold my Hand సాంగ్ నామినేట్ అయినా ఇది ఆస్కార్ లైవ్ పర్ఫార్మెన్స్ లిస్ట్ లో లేదు. ఆ పాటలతో పాటు ఆస్కార్ మెమరీలను గుర్తు చేస్తూ గ్రామీ విజేత లెన్నీ క్రావిట్జ్ స్పెషల్ ప్రదర్శన ఇవ్వనుంది. మన ఇండియన్ నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ వేదికపై లైవ్ చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్నారు.