oscar guests are gave standing ovation to Rahul Sipligunj kala bhairava performence
Oscars95 : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్ వేడుకలు మొదలు అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ప్రపంచ తరాల మధ్య ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకకు RRR సినిమా నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ.. మరికొంతమంది హాజరయ్యారు. RRR కి ఆస్కార్ వస్తుందా లేదా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
The Elephant Whisperers : ఆస్కార్ గెలిచిన ఇండియన్ సినిమా.. చరిత్ర సృష్టించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్!
ఇది ఇలా ఉంటే ఆస్కార్ వేదిక పై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటు నాటు’ సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉందని అందరికి తెలిసిన విషయమే. కాగా నేడు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన స్టేజి పై తమ పర్ఫామెన్స్ ఇచ్చారు రాహుల్ అండ్ కాలభైరవ. వీరిద్దరూ పాట పడుతుండగా.. అమెరికన్ డాన్సర్స్ స్టేజి పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే నాటు నాటు సాంగ్ మొత్తం పడలేదు. పాటలోని పల్లవి, రెండో చరణం పాడి పాటను ముగించేశారు. ఇక ఈ పాటకు ముందు ఇతర సాంగ్స్ కూడా పాడారు. వాటికీ కేవలం చప్పట్లు కొట్టి ఉరుకున్న ప్రేక్షకులు.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన నాటు నాటు సాంగ్ కి మాత్రం వేడుకలో అతిథులు అంత నిలబడి చప్పట్లు కొట్టారు.
Oscars95 : ఇండియన్ ఫిలిం ‘అల్ దట్ బ్రీత్స్’కి మిస్ అయ్యిన ఆస్కార్..
ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియోని RRR టీం తమ ట్విట్టర్ ద్వారా షేర్ చేయగా, ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఇదే స్టేజి పై ఆస్కార్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ ని ప్రభుదేవా నటించిన ABCD సినిమాలో యాక్ట్ చేసిన అమెరికన్ డాన్సర్ ‘లారెన్ గోట్లిబ్’ ఇవ్వనుంది. కాగా ఒక తెలుగు సాంగ్ కి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇంతటి గుర్తింపు రావడంతో తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Here’s the energetic performance of “Naatu Naatu” from #RRR at the #Oscars. https://t.co/ndiKiHeOT5 pic.twitter.com/Lf2nP826c4
— Variety (@Variety) March 13, 2023