మహర్షి : పదర పదర లిరికల్ సాంగ్
మహర్షి : పదర పదర పదరా.. సాంగ్‌కు శ్రీమణి అందమైన లిరిక్స్ రాయగా, శంకర్ మహదేవన్ అద్భుతంగా పాడాడు..

మహర్షి : పదర పదర పదరా.. సాంగ్‌కు శ్రీమణి అందమైన లిరిక్స్ రాయగా, శంకర్ మహదేవన్ అద్భుతంగా పాడాడు..
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజాహెగ్డే జంటగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీదత్, దిల్ రాజు, పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మిస్తున్న మహర్షి రిలీజ్‌కి రెడీ అవుతుంది. రీసెంట్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మహర్షి ఆల్బమ్ నుండి మరోసాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డిపరకతోనా.. ఎడారి కళ్ళు తెరుచుకున్నవేళన చినుకుపూల వాన.. అనే సాంగ్ వ్యవసాయం బ్యాక్ డ్రాప్‌లో వస్తుంది.. శ్రీమణి అందమైన లిరిక్స్ రాయగా, శంకర్ మహదేవన్ అద్భుతంగా పాడాడు.
Also Read : ఊపు ఊపుతున్న ముంబై, దిల్లీ ది కుడియా సాంగ్
పదర పదర పదరా.. నీ గతముకు కొత్త జననమిదిరా, పదర పదర పదరా.. నీ ఎత్తుకు తగిన లోతుఇది, తొలి పునాది గది తలుపు తెరిచి పదరా.. ఇలా ప్రతీ పదం స్ఫూర్తినిచ్చేలా ఉంది.. మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని, పీపుల్స్ ప్లాజాలో, సాయంత్రం 6 గంటలనుండి మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కానుంది. సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవనుంది.
Also Read : ఆర్ఆర్ఆర్ షూట్ లో ఎన్టీఆర్ కు గాయం
వాచ్, పదర పదర పదరా లిరికల్ సాంగ్…