Pailam Pilaga Trailer : బాలయ్యకు నచ్చిన ‘పైలం పిలగా’ ట్రైలర్ చూశారా?
'పిల్ల పిలగాడు' వెబ్‌సిరీస్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న సాయి తేజ హీరోగా నటిస్తున్న చిత్రం 'పైలం పిలగా'.

Pailam Pilaga Trailer released
‘పిల్ల పిలగాడు’ వెబ్‌సిరీస్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న సాయి తేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పైలం పిలగా’. ఆనంద్ గుర్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పావని కరణం హీరోయిన్. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. ఈ చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్ వెంకటేష్ మహా లాంచ్ చేశారు. ఓ యువకుడు తన ఊరిలోనే, తన భూమిలోనే సొంత వ్యాపారం ప్రారంభించి జీవితంలో ఎదగాలనుకుంటాడు. కానీ పంచాయితీ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్ ఆఫీస్ వరకు సవాళ్లు, అవినీతి, అలసత్వం నిండిన బ్యూరోక్రసీ సిస్టంలో ఇరుక్కొని ఎన్ని బాధలు పడ్డాడో తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రమే ‘పైలం పిలగా’.
ఇటీవల బాలకృష్ణ ఈ ‘పైలం పిలగా’ చిత్ర టీజర్, ట్రైలర్ ను చూసి మూవీ టీంని ప్రశంసించారు. తన మొట్ట మొదటి యాడ్ డైరెక్ట్ చేసిన ఆనంద్ గుర్రం తొలి సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా అంటూ మూవీ టీం కి అల్ ది బెస్ట్ చెప్పారు.
ఇక ఈ సినిమాలో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు నటిస్తున్నారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించగా సందీప్ బద్దుల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
Prasanth Varma – Mokshagnya : బాలయ్య తనయుడిని దగ్గరుండి రెడీ చేస్తున్న డైరెక్టర్.. ఫోటో వైరల్..