Prasanth Varma – Mokshagnya : బాలయ్య తనయుడిని దగ్గరుండి రెడీ చేస్తున్న డైరెక్టర్.. ఫోటో వైరల్..

తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ స్పెషల్ ఫోటో రివీల్ చేసాడు.

Prasanth Varma – Mokshagnya : బాలయ్య తనయుడిని దగ్గరుండి రెడీ చేస్తున్న డైరెక్టర్.. ఫోటో వైరల్..

mokshagna

Updated On : September 18, 2024 / 12:27 PM IST

Prasanth Varma – Mokshagnya : ఇటీవలే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. తేజస్వి నందమూరి, సుధాకర్ చెరుకూరి సంయుక్త నిర్మాణంలో మోక్షజ్ఞ మొదటి సినిమా రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ బాగా వైరల్ అయింది. ఇక ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఉండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Also Read : NTR – Anjana Rangan : 16 ఏళ్ళు అయింది.. ఇప్పటికి ఎన్టీఆర్ ని కలిసాను.. తమిళ్ యాంకర్ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ స్పెషల్ ఫోటో రివీల్ చేసాడు. ఇటీవల సినిమా అనౌన్స్ కు ముందు మోక్షజ్ఞకు సంబంధించి కొన్ని స్టైలిష్ ఫోటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రశాంత్ వర్మ ఆ ఫోటోషూట్ కి సంబంధించిన ఓ ఫోటో షేర్ చేసాడు. ఇందులో స్టైలిష్ లుక్ లో మోక్షజ్ఞ ఉండగా వెనక నుంచి ప్రశాంత్ వర్మ ఫోటో తీస్తున్నట్టు ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial)

దీంతో ఈ ఫోటో వైరల్ గా మారగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య బాబుని చాలా జాగ్రత్తగా ల్యాండ్ చేయడానికి దగ్గరుండి మరీ మోక్షుని రెడీ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Prasanth Varma Reveals Balayya Son Mokshagnya Photo shoot Special Pic Photo goes Viral