NTR – Anjana Rangan : 16 ఏళ్ళు అయింది.. ఇప్పటికి ఎన్టీఆర్ ని కలిసాను.. తమిళ్ యాంకర్ ఎమోషనల్ పోస్ట్..
దేవర ఈవెంట్ అయ్యాక తమిళ సీనియర్ యాంకర్ అంజన తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Tamil Senior Anchor Anjana Rangan Emotional Post after Hosting NTR Devara Event
NTR – Anjana Rangan : నిన్న ఎన్టీఆర్ చెన్నైలో దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ కి తమిళ సీనియర్ యాంకర్ అంజన రంగన్ యాంకరింగ్ చేసింది. మనకి తెలుగులో సుమ ఎలాగో తమిళ్ లో అంజన కూడా ఆల్మోస్ట్ అంతే. తమిళ్ సీనియర్ యాంకర్స్ లో అంజన రంగన్ ఒకరు. అయితే దేవర ఈవెంట్ అయ్యాక అంజన తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.
తమిళ్ యాంకర్ అంజన ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలు షేర్ చేసి.. నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఇవాళ్టికి 16 ఏళ్ళు పూర్తయింది. 17వ సంవత్సరంలోకి ఒక డ్రీమ్ లాంటి ఈవెంట్ తో అడుగుపెడుతున్నాను. చాలా మంచి వ్యక్తి ఎన్టీఆర్ కి చెందిన దేవర సినిమా ప్రెస్ ఈవెంట్ ని హోస్ట్ చేశాను. ఇన్నేళ్ళుగా అతన్ని స్క్రీన్ పై చూసి ఇష్టపడ్డాను. డైరెక్ట్ గా ఎప్పుడు చూస్తానా అని ఆరాటపడ్డాను. నా స్పెషల్ డే రోజు దేవుడు నాకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు అని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.
Also See : NTR Devara Press Meet : ఎన్టీఆర్ ‘దేవర’ ప్రెస్ మీట్ ఫోటోలు చూశారా..?
దీంతో అంజన పోస్ట్ వైరల్ గా మారగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంజన పోస్ట్ కింద ఆమెని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తమిళ్ లో కూడా ఎన్టీఆర్ కి ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉందా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.
I comeplete 16 years in this industry today and stepping into 17th year with a dream come true event! Hosted The most humble and warm @tarak9999 ‘s #ManOfMasessNTR #Devara chennai press event and how much i love watching him onscreen and been yearning to see him in person! God… pic.twitter.com/FcRhP5KA9C
— Anjana Rangan (@AnjanaVJ) September 17, 2024