mokshagna
Prasanth Varma – Mokshagnya : ఇటీవలే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. తేజస్వి నందమూరి, సుధాకర్ చెరుకూరి సంయుక్త నిర్మాణంలో మోక్షజ్ఞ మొదటి సినిమా రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ బాగా వైరల్ అయింది. ఇక ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఉండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Also Read : NTR – Anjana Rangan : 16 ఏళ్ళు అయింది.. ఇప్పటికి ఎన్టీఆర్ ని కలిసాను.. తమిళ్ యాంకర్ ఎమోషనల్ పోస్ట్..
తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ స్పెషల్ ఫోటో రివీల్ చేసాడు. ఇటీవల సినిమా అనౌన్స్ కు ముందు మోక్షజ్ఞకు సంబంధించి కొన్ని స్టైలిష్ ఫోటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రశాంత్ వర్మ ఆ ఫోటోషూట్ కి సంబంధించిన ఓ ఫోటో షేర్ చేసాడు. ఇందులో స్టైలిష్ లుక్ లో మోక్షజ్ఞ ఉండగా వెనక నుంచి ప్రశాంత్ వర్మ ఫోటో తీస్తున్నట్టు ఉంది.
దీంతో ఈ ఫోటో వైరల్ గా మారగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య బాబుని చాలా జాగ్రత్తగా ల్యాండ్ చేయడానికి దగ్గరుండి మరీ మోక్షుని రెడీ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.