Pallavi Prashanth first Video after Winning Bigg Boss Season 7 Title
Pallavi Prashanth : బిగ్‌బాస్(Bigg Boss) సీజన్ 7లో విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించిన దగ్గర్నుంచి వైరల్ అవుతూనే ఉన్నాడు. హౌస్ లో, బిగ్‌బాస్ కి వెళ్ళకముందు అమాయకంగా, వినయంగా ఉండి సింపతితో కప్పు కొట్టేశాక బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక తన యాటిట్యూడ్ చూపిస్తూ వైరల్ అయ్యాడు.
బిగ్‌బాస్ ఫైనల్ రోజు రాత్రి బయటికి వచ్చాక ప్రశాంత్, అతని ఫ్యాన్స్ రోడ్డు మీద ఊరేగింపు అంటూ నానా హంగామా చేశారు. పలు వాహనాలు ధ్వంసం చేశారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ తో పాటు అతని ఫ్యాన్స్ పై కూడా పోలీసులు కేసులు పెట్టాడు. మీడియాతో కూడా చాలా రూడ్ గా మాట్లాడాడు. ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వను అంటూ అసభ్య పదజాలం కూడా వాడినట్టు మలువురు యూట్యూబ్ యాంకర్స్ తమ సోషల్ మీడియాలో తెలిపారు.
అయితే బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక మొదటిసారి డైరెక్ట్ గా ప్రశాంత్ మాట్లాడుతూ ఓ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రశాంత్ ఎప్పటిలాగే తన పొలంలో కూర్చొని ఎమోషనల్ గా మాట్లాడాడు ఈ వీడియోలో. పల్లవి ప్రశాంత్ ఈ వీడియోలో.. నాకు ఇవాళ చాలా బాధగా ఉంది. గెలిచినా ఆనందం కూడా లేకుండా చేస్తున్నారు. ఇవాళ ఒక రైతుబిడ్డ గెలిచాడని అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా ఊర్లో ఘన స్వాగతం పలికారు. నేను బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక నా కోసం ఇంతమంది వచ్చారా అని ఆనందపడ్డాను. కానీ మీడియా వాళ్ళు నన్ను నెగిటివ్ చేద్దామని చూస్తున్నారు. నా కోసం అక్కడికి దాదాపు 70 యూట్యూబ్ ఛానల్స్ దాకా వచ్చాయి. వాళ్ళు అందరి 5, 10 నిముషాలు అని ఇంటర్వ్యూలు అడిగారు. నేను అప్పటికే అలిసిపోయి ఉన్నా, ఆకలి వేస్తుంది, ఏం తినలేదు, తర్వాత ఇస్తాను ఇంటర్వ్యూలు అని చెప్పాను. నా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఒక రైతు బిడ్డ గెలవడం తప్పా? నేను తప్పు చేశానా లేదా అని మా వాళ్లకి తెలుసు అంటూ ఎమోషనల్ గా మరోసారి సింపతీ తెచ్చుకోవడానికి అన్నట్టు మాట్లాడాడు.
Also Read : Pallavi Prashanth : బిగ్‌బాస్‌లో అలా.. కప్పు గెలిచాక ఇలా.. రైతులకు హెల్ప్ చేయడానికి నేనేమన్నా సీఎంనా?
అయితే అతనిపై పెట్టిన కేసులు, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ, వేరే కంటెస్టెంట్స్ మీద ఇతని ఫ్యాన్స్ చేసిన దాడులు, యూట్యూబ్ ఛానల్స్ పై ఇతను చేసిన కామెంట్స్ గురించి మాట్లాడకపోవడం గమనార్హం. దీంతో పల్లవి ప్రశాంత్ పెట్టిన వీడియో కింద అందరూ ఇతన్ని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.