అన్నదాతకే ఆత్మహత్యలా – రైతన్న పాట విడుదల చేసిన చంద్రబాబు నాయుడు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుద‌ల చేసిన సముద్ర ‘జై సేన` చిత్రంలోని ‘పల్లె తల్లి నుదిటిమీద బొట్టే రైతన్నా’.. పాట‌..

  • Published By: sekhar ,Published On : February 8, 2020 / 12:48 PM IST
అన్నదాతకే ఆత్మహత్యలా – రైతన్న పాట విడుదల చేసిన చంద్రబాబు నాయుడు

Updated On : February 8, 2020 / 12:48 PM IST

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుద‌ల చేసిన సముద్ర ‘జై సేన` చిత్రంలోని ‘పల్లె తల్లి నుదిటిమీద బొట్టే రైతన్నా’.. పాట‌..

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఇప్పటికే విడుదలైన టీజ‌ర్‌, పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా ఈ చిత్రంలోని ‘పల్లె తల్లి నుదిటిమీద బొట్టే రైతన్నా’ సాంగ్‌ను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా.. చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ : “రైతుల గొప్పతనాన్ని తెలియజేసే పాటను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదలచేయడం చాలా సంతోషంగా ఉంది. అభినయ శ్రీనివాస్ చక్కని సాహిత్యం అందించిన ఈ పాటను కారుణ్య అంతే శ్రావ్యంగా ఆలపించారు. సంగీత దర్శకుడు రవిశంకర్ మంచి ట్యూన్ ఇచ్చాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాట‌కి అంతకన్నా మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నాం. అందరి అభిమానులు, రెండు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన చిత్రం జైసేన’’ అన్నారు.

 

jaisena

అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : తిరుమల శెట్టి సుమన్‌, పార్వతిచందు, పాటలు : అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ, సంగీతం : రవిశంకర్‌, డ్యాన్స్‌ : అమ్మా రాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌ : కనల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, కెమెరా : వాసు, కో ప్రొడ్యూసర్స్‌ : పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, నిర్మాత : వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : వి.సముద్ర.