Pandu Master : ఆ శివయ్యే వచ్చి నాకు ఇరుముళ్ళు కట్టాడు.. అక్కడికి వెళ్లొచ్చాక..

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఢీ షోతో ఫేమ్ తెచ్చుకున్న పండు అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు.(Pandu Master)

Pandu Master

Pandu Master : ఢీ షోతో ఫేమ్ తెచ్చుకున్న పండు ఇప్పుడు ఆర్టిస్ట్ గా, డ్యాన్స్ మాస్టర్ గా, ఢీ షో చేస్తూ బిజీగానే ఉన్నాడు. తను డ్యాన్స్ తోనే కాక కామెడీతో కూడా ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పండు అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు.(Pandu Master)

పండు మాస్టర్ మాట్లాడుతూ.. ఒక రెండేళ్ల క్రితం నేను శివ మాల వేసుకున్నా. మాల అయ్యాక తీసెయ్యడానికి శ్రీశైలం వెళ్ళాను. వెళ్తుంటే దారిలో ఒకతను లిఫ్ట్ అడిగారు పెద్దాయన. నేను కార్ ఆపాను. ఆయన కార్ ఎక్కి.. ఏం చేయాలో తెలియట్లేదు శివయ్యని అడగ్గానే నీ కారు ఆగింది. దేవుడి కోసం కోరుకుంటే ఆయనే చేస్తాడు ఎలాగైనా, నిన్ను శివయ్య పంపించాడు అని చెప్పాడు. నేను సరే ఇలాగే చెప్తారు హెల్ప్ చేసాము కదా అనుకోని ఆయనకు లిఫ్ట్ ఇచ్చా.

Also Read : Chiranjeevi : ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో.. ఏడ్చేసిన చిరంజీవి.. ఇంతకీ అది ఏ సినిమా..?

శ్రీశైలం వెళ్ళాక ఇరుముళ్ళు గురించి నాకు తెలియదు. నేను మాల వేసుకున్నాను తీసేయడానికి వచ్చాను, ఇరుముళ్ళు గురించి తెలీదు అని చెప్పాను అక్కడ పంతులు అడిగితే. ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళు ఇరుముడి కట్టుకొని రావాలి కదా అన్నారు. నేను ఏం చేయాలో తెలియట్లేదు ఏదో ఒకటి చెయ్యి అని శివుడ్ని దండం పెట్టుకున్నాను. అంతలో ఒక ఆయన వచ్చి నాతో రా అని తీసుకెళ్లి పూజ చేసి ఇరుముళ్ళు కట్టించి మొత్తం చేసి.. వెళ్తాను అని చెప్పి వెళ్లిపోయారు. ఆయన మళ్ళీ నేను కనిపించలేదు.

ఎలా వచ్చారు, ఆయన ఎవరు.. నేను దండం పెట్టుకోగానే వచ్చి చేసి వెళ్లిపోయారు, వెంటనే దర్శనం చేసుకున్నా అంతా నాకు తెలియకుండా అయిపోయింది. ఆ శివుడే పంపించి ఇరుముళ్ళు కట్టించాడో, ఆ శివుడే వచ్చి కట్టాడో తెలియదు. కానీ దేవుడ్ని అడిగితే జరుగుతుంది. అప్పుడు ఆ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కోరుకుంటే దేవుడు ఎలా అయినా వచ్చి జరిపిస్తాడు అని.

Also Read : Tamannaah Bhatia : సన్నీలియోన్ ప్లేస్ లో ‘తమన్నా’.. అడల్ట్ హారర్ సినిమాలో మరోసారి రెచ్చిపోనున్న మిల్కీ బ్యూటీ..

నాకు ఇటీవల కొంచెం ఫేమ్ తగ్గింది అనిపించింది. ఎక్కువ ఫామ్ లో లేను, కరెక్ట్ గా ఏది పడట్లేదు. అలాంటి టైంలో అరుణాచలం వెళ్లి వచ్చి రాగానే ఇటుక మీద ఇటుక సాంగ్ పడి పెద్ద హిట్ అయింది. నాకు ఒక ఫేమ్ రాగానే మళ్ళీ పడిపోతూ ఉంటా. కానీ ఆ సాంగ్ తర్వాత వరుసగా రెండు పాటలు హిట్ అయ్యాయి. అరుణాచలం వల్లే అనుకున్నాను. దేవుడు నాతో ఉన్నాడు అని ఫీలింగ్ అంటూ తెలిపాడు.