Aadi Keshava : లీలమ్మో మాస్ డాన్స్ అదరగొట్టేసిందమ్మా.. ఆదికేశవ కొత్త సాంగ్ చూశారా..!
వైష్ణవ తేజ్, శ్రీలీల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న సినిమా ‘ఆదికేశవ’ నుంచి మరో సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.

Panja Vaisshnav Tej Sreeleela Aadi Keshava Leelammo Song Promo release
Aadi Keshava : మెగా హీరో వైష్ణవ తేజ్, మోస్ట్ హ్యాపెనింగ్ యాక్ట్రెస్ శ్రీలీల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న సినిమా ‘ఆదికేశవ’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని దసరా పండుగ నుంచే మొదలు పెట్టేశారు. హీరోహీరోయిన్లు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. అలాగే మరోపక్క సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ రెండు సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి.
తేజగా ఈ చిత్రం నుంచి మూడో సాంగ్ ప్రోమో వదిలారు. ‘లీలమ్మో’ అనే ఈ మాస్ బీట్ సాంగ్ కి వైష్ణవ తేజ్ తో కలిసి శ్రీలీల మాస్ డాన్స్ వేసి అదరగొట్టేసింది. ఒక చిన్న ప్రోమోలోని తన డాన్స్ ఎనర్జీతోనే ఈ రేంజ్ ఫైర్ క్రియేట్ చేసిందంటే.. రేపు థియేటర్స్ లో ఆడియన్స్ ని శ్రీలీల తన డాన్స్ తో ఉర్రూతలూగిస్తుంది. జివి ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ లీలమ్మో పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్, శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. మరి ఆ ఎనర్జిటిక్ ప్రోమోని మీరు కూడా చూసేయండి.
Also read : Pawan Kalyan : ఏపీ రాజకీయాలు గురించి సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడాలి..?
కాగా ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ ఈ మూవీలో విలన్ కనిపించబోతున్నాడు. ఉప్పెన తరువాత మళ్ళీ వైష్ణవ సరైన హిట్టు అందుకోలేదు. మరి ఈ చిత్రంతో ఒక సూపర్ హిట్టుని అందుకొని కమ్‌బ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి.