pathaan is one step away from crossing bahubali 2 Hindi Lifetime Share Collection
Pathaan Collections : షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా, సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించి, చాలా రోజుల తర్వాత బాలీవుడ్ లో హిట్ టాక్ తెచ్చుకొని భారీ కెల్క్షన్స్ సాధించింది. ఈ సినిమాతో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత షారుఖ్ హిట్ కొట్టడమే కాకుండా గత సంవత్సర కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ కి పెద్ద విజయాన్ని అందించాడు.
ఇక ఈ సినిమా మొదటి నుంచి కూడా కలెక్షన్స్ బాగా రాబట్టింది. మొదటి వారంలోనే 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది పఠాన్ సినిమా. ఇక ఆ తర్వాత మొత్తంగా నెల రోజులకు ఇంకో 400 కోట్ల గ్రాస్ రాబట్టి 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఎలాగైనా పఠాన్ సినిమా సౌత్ సినిమాలైన బాహుబలి, KGF కలెక్షన్స్ దాటాలని అనుకుంది. కానీ మొదటి వారం కలెక్షన్స్ బాగానే వచ్చినా ఆ తర్వాత నుంచి స్లో అయింది. దీంతో కనీసం 1000 కోట్లు వస్తే చాలనుకున్నారు. ఇటీవల సినిమా రిలీజ్ అయిన నెలరోజులకు మొత్తానికి 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సింగిల్ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమాగా సరికొత్త రికార్డ్ సృష్టించింది.
అయితే బాహుబలి 2, KGF 2ల మొత్తం కలెక్షన్స్ రికార్డులు బద్దలు కొట్టకపోయినా కొన్ని రికార్డులని మాత్రం బద్దలుకొట్టింది. ఇప్పటికే ఈ రెండు సినిమాల 400 కోట్ల షేర్ కలెక్షన్స్ ని చాలా ఫాస్ట్ గా దాటేసి త్వరగా ఆ కలెక్షన్స్ సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు మరో రికార్డు బద్దలు కొట్టడానికి పఠాన్ రెడీ అవుతుంది. బాహుబలి 2 సినిమా ఫుల్ రన్ లో కేవలం హిందీలోనే 512 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించి అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. పఠాన్ సినిమా ఇప్పటికే 1020 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా, అందులో కేవలం 525 కోట్ల షేర్ కలెక్షన్స్ ని మాత్రమే ఇండియాలో సాధించింది. ఇక హిందీలో 507 కోట్ల షేర్ కలెక్షన్స్ ని సాధించింది పఠాన్ సినిమా. ఇప్పుడు బాహుబలి 2 సినిమా హిందీ కలెక్షన్స్ 512 కోట్లు దాటించాలంటే పఠాన్ సినిమాకు ఇంకా 5 కోట్ల షేర్ కలెక్షన్స్ అంటే దాదాపు 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి.
Zee Cine Awards 2023 : జీ సినీ అవార్డ్స్ 2023 బాలీవుడ్.. పూర్తి సమాచారం..
ఇటీవల ఈ సినిమాకి కలెక్షన్స్ త్వరగా 1000 కోట్లు రావడానికి టికెట్ రేట్లు కూడా తగ్గించి మరీ ఆఫర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బాహుబలి హిందీ రికార్డ్ అయినా సాధించాలి అని పఠాన్ టీం చూస్తుంది. మరి 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కేవలం హిందీ బెల్ట్ లో పఠాన్ సినిమాకి ఎప్పుడు వస్తుందో చూడాలి. బాహుబలి 2 హిందీ రికార్డ్ పఠాన్ కొల్లగొడుతుందేమో చూడాలి మరి.
#Pathaan has yet another strong weekend… Inches closer to #Baahubali2 #Hindi *lifetime biz*… [Week 5] Fri 1.02 cr, Sat 1.98 cr, Sun 2.45 cr. Total: ₹ 507.60 cr. #Hindi. #India biz. pic.twitter.com/bpi6jJDtp9
— taran adarsh (@taran_adarsh) February 27, 2023