Zee Cine Awards 2023 : జీ సినీ అవార్డ్స్ 2023 బాలీవుడ్.. పూర్తి సమాచారం..

తాజాగా బాలీవుడ్ లో జీ సినీ అవార్డ్స్ 2023 ఘనంగా జరిగాయి. జీ సినీ అవార్డ్స్ 2023 వేడుకలు ముంబైలో ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా జరగగా అనేక మంది బాలీవుడ్ స్టార్లు విచ్చేశారు............

Zee Cine Awards 2023 : జీ సినీ అవార్డ్స్ 2023 బాలీవుడ్.. పూర్తి సమాచారం..

Zee Cine Awards 2023 Bollywood Full list

Zee Cine Awards 2023 :  2022లో రిలీజయిన సినిమాలకు వరుసగా పలు సంస్థలు అవార్డుల కార్యక్రమాలు నిర్వహించి బెస్ట్ అవార్డులు అందిస్తున్నారు. ఇటీవలే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023 అవార్డు వేడుకలు జరిగాయి. తాజాగా బాలీవుడ్ లో జీ సినీ అవార్డ్స్ 2023 ఘనంగా జరిగాయి. జీ సినీ అవార్డ్స్ 2023 వేడుకలు ముంబైలో ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా జరగగా అనేక మంది బాలీవుడ్ స్టార్లు విచ్చేశారు. అవార్డులు అందుకున్న వాళ్ళు తమ అవార్డులతో సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. జీ సినీ అవార్డ్స్ 2023 వేడుకలకు సంబంధించి ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

బాలీవుడ్ జీ సినీ అవార్డ్స్ 2023 కార్యక్రమంలో అవార్డులు అందుకున్న వారి పూర్తి లిస్ట్..

 

బెస్ట్ యాక్టర్ – కార్తీ ఆర్యన్ (భూల్ భూలయ్య 2)

బెస్ట్ యాక్ట్రెస్ – అలియా భట్ (గంగూభాయ్ కతీయవాడి)

బెస్ట్ ఫిలిం (వ్యూయర్స్ ఛాయస్) – ది కశ్మీర్ ఫైల్స్

బెస్ట్ ఫిలిం – డార్లింగ్స్

బెస్ట్ యాక్ట్రెస్ (జ్యూరీ) – అలియా భట్ (డార్లింగ్స్)

బెస్ట్ యాక్టర్ (వ్యూయర్స్ ఛాయస్) – అనుపమ్ ఖేర్ (ది కశ్మీర్ ఫైల్స్)

బెస్ట్ స్క్రీన్ ప్లే – ది కశ్మీర్ ఫైల్స్

బెస్ట్ మ్యూజిక్ – ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర)

బెస్ట్ ఎడిటర్ – సంయుక్త కాజా (భేడియా)

బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ – సచిన్ – జిగర్ (భేడియా)

మోస్ట్ స్ట్రీమ్ ఆల్బమ్ అఫ్ ది ఇయర్ – సచిన్ – జిగర్ (భేడియా)

బెస్ట్ సౌండ్ డిజైన్ – కునాల్ శర్మ (భేడియా)

బెస్ట్ కొరియోగ్రఫీ – బాస్కో – సీజర్ (భూల్ భూలయ్య 2)

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – షీబా చద్దా (డాక్టర్ G)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – అనిల్ కపూర్ (జుగ్ జుగ్ జీయో)

పర్ఫార్మర్ అఫ్ ది ఇయర్ మేల్ – వరుణ్ ధావన్ (జుగ్ జుగ్ జీయో, భేడియా)

పర్ఫార్మర్ అఫ్ ది ఇయర్ ఫిమేల్ – కియారా అద్వానీ (జుగ్ జుగ్ జీయో, భూల్ భూలయ్య 2)

బెస్ట్ డెబ్యూట్ – రష్మిక మందన్న (గుడ్ బై)

ఈ సారి జీ సినీ అవార్డ్స్ 2023 బాలీవుడ్ అవార్డ్స్ లో భేడియా సినిమా ఎక్కువగా 5 అవార్డుని సాధించింది. అనంతరం ది కశ్మీర్ ఫైల్స్, భూల్ భూలయ్య 2 సినిమాలు మూడు అవార్డుని సాధించాయి.

Kangana Ranaut : బాలీవుడ్ యువ హీరోపై కంగనా వ్యాఖ్యలు.. ఆ హీరో ఏమన్నాడో తెలుసా??