Kiran Abbavaram : పవన్ సినిమాకి పోటీగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన యువ హీరో.. ట్రోల్ చేస్తున్న అభిమానులు

పవన్ ఫ్యాన్ అని చెప్పుకునే కిరణ్ తన సినిమాని పవన్ ప్రకటించిన డేట్ రోజు రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో పవన్ అభిమానులు కిరణ్ ని ట్రోల్ చేస్తున్నారు. పవన్ అభిమానులు కిరణ్ ని...........

Pavan

Kiran Abbavaram :  కరోనా కారణంగా సినిమాలన్నీ వాయిదా పడటంతో పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి నుంచి సమ్మర్ కి వాయిదా పడ్డాయి. గత రెండు రోజుల నుంచి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ అన్ని సమ్మర్ ని టార్గెట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీంతో చిన్న సినిమాలు కూడా కొన్ని సమ్మర్ టార్గెట్ గా రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే యువ హీరో కిరణ్ అబ్బవరం తన నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు.

‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమై, ‘SR కల్యాణ మండపం’తో మెప్పించి ఇండస్ట్రీలో అందరితో మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తూ వరుస సినిమా అవకాశాలని సాధిస్తున్నాడు. ఇప్పటికే ఈ యువ హీరో చేతిలో దాదాపు అయిదు సినిమాలు ఉన్నాయి. తాజాగా తన తర్వాతి సినిమా ‘సెబాస్టియన్ PC 524’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు. ఈ సినిమా అనౌన్స్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. కరోనా కారణంగా సినిమా లేట్ అయింది. ఇటీవలే పూర్తి అయిన ఈ సినిమాని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

Ashureddy : ఆర్జీవీ నుంచి నేర్చుకున్నాం అంటూ.. అరియనా నడుముపై అషూరెడ్డి ముద్దు.. నెటిజన్స్ ట్రోలింగ్

అయితే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాని ఫిబ్రవరి 25న ప్రకటిస్తామని అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 25తో పాటు ఏప్రిల్ 1 డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఫిబ్రవరి 25న రిలీజ్ చేయొచ్చు అనే టాక్ వినిపిస్తుంది మొదటి నుంచి. పరిస్థితులను బట్టి ఈ రెండిటిలో ఏ రోజు అయినా సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే పవన్ ఫ్యాన్ అని చెప్పుకునే కిరణ్ తన సినిమాని పవన్ ప్రకటించిన డేట్ రోజు రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో పవన్ అభిమానులు కిరణ్ ని ట్రోల్ చేస్తున్నారు.

Vijay Devarakonda : మొన్న కస్తూరి.. నిన్న మాళవిక.. సీనియర్ హీరోయిన్స్‌కి తెగ నచ్చేస్తున్న విజయ్ దేవరకొండ

పవన్ ఫ్యాన్ అని చెప్పుకొని పవన కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రోజు నీ సినిమాని ఎలా రిలీజ్ చేస్తావు అంటూ కొంతమంది పవన్ అభిమానులు కిరణ్ ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పవన్ అభిమానులకి కోపం వస్తే చాలా నష్టం జరిగిపోతుందని తెలుసు కాబట్టి దీంతో కిరణ్ చాలా తెలివిగా ఓ నెటిజన్ పోస్ట్ కి రిప్లై ఇచ్చాడు. ”మీ కంటే ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. నా సినిమా రిలీజ్ ఉన్నా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో మాత్రం అన్న సినిమాకే రచ్చ చేస్తాను” అంటూ పోస్ట్ పెట్టి పవన్ అభిమానులని కొంతవరకు శాంతిపచేసే ప్రయత్నం చేశాడు. మరి ఈ రెండు సినిమాలలో ఏది రిలీజ్ అవుతుందో ఏది వాయిదా పడుతుందో, లేదా రెండూ రిలీజ్ అవుతాయో చూడాలి మరి.