Pawan Kalyan : సైనికుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. తన ఫ్యాన్స్ కి ఓ బిగ్ అప్ డేట్ ఇచ్చారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Pawan Kalyan : సైనికుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

Pawan Kalyan As Army Officer in Ustad Bhagat Singh Movie

Updated On : May 14, 2025 / 4:26 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. తన ఫ్యాన్స్ కి ఓ బిగ్ అప్ డేట్ ఇచ్చారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ డేట్స్ ఫిక్స్ చేశారట. ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూన్ 12 నుంచి ప్రారంభం అవుతుంద‌ట‌. ఈ సినిమాలో పవన్.. సైనికుడి పాత్రలో కనిపించనున్నాడని, ఆపరేషన్ సింధూర్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవన్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. గతంలో తమిళ హిట్ తేరి రీమేక్‌గా భావించిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు పూర్తిగా కొత్త కథతో రూపొందుతోందని గాసిప్. హరీష్ శంకర్ స్క్రిప్ట్‌లో సీరియస్ మార్పులు చేస్తున్నాడట.

Kingdom : అఫీషియ‌ల్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ ‘కింగ్‌డ‌మ్’ వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఒక సైనికుడి హీరోయిజం, దేశభక్తితో కూడిన కథని రాస్తున్నాడని టాక్. పవన్ కళ్యాణ్ రియల్-లైఫ్ జనసేన ఇమేజ్‌ని, సైనికుడి పాత్రతో మిక్స్ చేసి, డైలాగ్స్‌లో రాజకీయ సెటైర్లు, మాస్ ఎలిమెంట్స్‌ని జోడిస్తున్నాడట. ఈ స్టోరీలో ఎమోషనల్ డెప్త్‌తో పాటు పవన్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్ అవుతాయని ఇన్‌సైడ్ టాక్.

Ramcharan-NTR : రామ్ చరణ్, ఎన్టీఆర్ యాక్షన్ మరోసారి?

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ని డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోందట