Pawan Kalyan breaks 20-year-old rules for OG movie
OG: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. గ్యాంగ్ స్టర్ డ్రామాగా పాన్ ఇండియా లెవల్లో డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాను(OG) తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, శామ్ కీలక పాత్రలోనటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది ఈ సినిమా.
ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ ఓజీ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే సినిమా బాగుంటుందని ఆడియన్స్ చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం సాంగ్ కూడా పాడారు. అలాగే ఈ సినిమా కోసం ఏకంగా 20 ఏళ్ళ రూల్ ను బ్రేక్ చేశాడట ఆయన. ఈ విషయాన్ని ఓజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆడియన్స్ తో పంచుకున్నాడు. ఇండియన్ ఐడల్ సీజన్ 4 జడ్జీగా ఉన్న తమన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఖుషి సినిమా తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి రికార్డింగ్ థియేటర్‌కు వచ్చాడు. ఓజీ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే మెయిన్ సీక్వెన్స్ ఆయన చూశాడు. అవుట్‌పుట్ పట్ల చాలా సంతోషంగా ఉండటమే కాదు.. మాపై ఆయనకున్న ప్రేమను చూపించాడు.
వాషి యో వాషి సాంగ్ రికార్డింగ్ టైంలో మీరు ఓజీ హుడీ వేసుకుంటారా..? అని అడగగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హుడీ వేసుకున్నాడు ఆయన” అంటూ స్టూడియోలో జరిగిన క్యూట్ విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ తన ఏ సినిమాకి కూడా అలా స్టూడియోకి వెళ్లరు. ఆయనకు అలాంటి ఇష్టం ఉండదు. కానీ, ఓజీ సినిమా కోసం వెళ్లారంటే ఆయనకు ఈ సినిమా ఎంత ప్రత్యేకమో అర్థం అవుతోంది. మరి, భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.