Pawan Kalyan : తమిళ పరిశ్రమ తమ పద్ధతి మార్చుకోవాలి.. మీరు కూడా RRR లాంటి సినిమాలు తియ్యాలి..
బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్.. తమిళ సినీ పెద్దల నిర్ణయానికి కౌంటర్ ఇచ్చాడు. మీ పద్ధతి మార్చుకుంటే RRR లాంటి సినిమాలు మీరు కూడా..

Pawan Kalyan comments on Tamil cinema industry recent decision
Pawan Kalyan : ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తమిళ సినిమాల్లో తమిళ నటులు, టెక్నీషియన్స్ మాత్రమే ఉండాలి. తమిళనాడు మాత్రం చిత్రీకరణ జరుపుకోవాలి అంటూ ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఈ విషయం పై తమిళనాటతో పాటు ఇతర పరిశ్రమల్లో కూడా పెద్ద చర్చనీయాంశం అయ్యింది. తాజాగా దీని పై పవన్ కళ్యాణ్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు.
Pawan Kalyan : తేజ్‌కి యాక్సిడెంట్ అయిన సమయంలో ఒక మూలన కూర్చుని ఏడ్చా..
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
తమిళ చిత్ర పరిశ్రమకి నాది ఒక చిన్న విన్నపం. తమిళ పరిశ్రమలో తమిళ వాళ్ళే ఉండాలనే ఒక భావన ఉందని బయట వింటున్నాను. ఆ ఆలోచన పద్ధతి మార్చుకోవాలి. ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుతుంది అంటే అన్ని బాషల నుంచి వచ్చిన నటీనటులు, సాంకేతిక నిపుణలను తీసుకుంటున్నాము. ఇలా అన్ని భాషలు, ప్రాంతాల కలయిక ఉంటేనే సినిమా అవుతుంది. అలా కాకుండా మన వాళ్ళే ఉండాలి అంటే పరిశ్రమ ఎదగలేదు. ఇక్కడ ఉన్న తమిళ నటుడు, దర్శకుడు సమక్షంలో చెబుతున్నాను.
Pawan Kalyan : మా వదిన నాకు చాలా ద్రోహం చేసింది.. దాని వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాను..
అలాంటి చిన్న స్వభావం నుంచి బయటకి వచ్చి మీరు కూడా RRR లాంటి పెద్ద సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. జెంటిల్ మెన్, రోజా వంటి సినిమా భాషతో సంబంధం లేకుండా విజయం అయ్యిందంటే.. ఆ చిత్రాలను అందరి పరిచయం చేసిన నిర్మాత ఏ ఎం రత్నం గారి గొప్పతనం. రత్నం గారి వాళ్ళే తమిళ పరిశ్రమ పెద్దది అయ్యింది. అక్కడి సినీ కార్మికులకు సమస్య అంటే.. అది ఇంకో రకంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. అంతేగాని ఇలా ఆలోచన పరిశ్రమకి మంచిది కాదు. అందుకనే తమిళ సినీ పెద్దలకు నా చిన్న విన్నపం. ఈ నిర్ణయం మరోసారి ఆలోచించండి.