Pawan Kalyan : OG షూటింగ్ షెడ్యూల్ పూర్తి.. ముంబై నుంచి పవన్ రిటర్న్..? OG కి మళ్ళీ బ్రేక్..

నేటితో OG షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది.

Pawan Kalyan Completed OG Movie Shooting Schedule and Returns to AP from Mumbai

Pawan Kalyan : గత కొన్నేళ్లుగా పవన్ రాజకీయాల బిజీ వల్ల ఆగిపోయిన సినిమాలకు ఇప్పుడు వరుసగా డేట్స్ ఇస్తూ ఆ సినిమాలను పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే హరిహర వీరమల్లు పూర్తి చేయగా ఇప్పుడు OG షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ముంబైలో OG షూటింగ్ పగలు రాత్రి తేడా లేకుండా శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ముంబై నుంచి పవన్ షూటింగ్ ఫోటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే.

అయితే నేటితో OG షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. తాజాగా పవన్ ముంబై నుంచి ఏపీకి రిటర్న్ అవడానికి ముంబై ఎయిర్ పోర్ట్ కి వచ్చిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఇటీవల OG సినిమాలో నటించే ఇమ్రాన్ హష్మీకి డెంగ్యూ రావడంతో షూటింగ్ కి బ్రేక్ తీసుకున్నాడు. దీంతో పవన్ – ఇమ్రాన్ హష్మీ కాంబో సీన్స్ కోసం ఇమ్రాన్ తిరిగొచ్చే వరకు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

Also Read : Re Release Movies : కొత్త సినిమాలను తొక్కేస్తున్న రీ రిలీజ్ సినిమాలు.. డైరెక్ట్ గానే చెప్తున్న నిర్మాతలు..

OG సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ త్వరగా కోలుకొని వస్తే OG షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ షూట్ ఉండనుందని సమాచారం. ఇక OG సినిమాని సెప్టెంబర్ 25 రిలీజ్ చేయనున్నారు.

Also Read : Dil Raju : శతమానం భవతి సీక్వెల్, ఆర్య 3.. రెండు సినిమాలు ఆ హీరోతోనే చేయనున్న దిల్ రాజు..?